హైదరాబాద్ లో చాపకింద నీరులా విస్తరిస్తున్న కొరొనా వైరస్

హైదరాబాద్ పోలీస్ లిమిట్స్ లో ఇప్పటి వరకు 399 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 8 కేసులు కొత్త కేసులను గుర్తించారు.
ఇప్పటి వరకు హైదరాబాద్ కమిషనర్ లిమిట్స్ లో కోలుకున్న వారు 51 మంది కాగా,  20 మంది చనాపోయారు. కరోనా కట్టడి పటిష్టంగా జరిగేందుకు చర్య లు తీసుకుంటున్న నేపథ్యంలో పోలీస్ లిమిట్స్ లో జోన్లు వారిగా కేసుల లిస్ట్ నుపోలీసుకమిషనర్  విడుదల చేశారు.

వెస్ట్ జోన్-సౌత్ జోన్ లలో  కొరొనా ప్రభావం తీవ్రంగా ఉంది.
వెస్ట్ జోన్-138, సౌత్ జోన్-170 కేసులు నమోదయ్యాయి.
సెంట్రల్ జోన్-45, ఈస్ట్ జోన్-33 కేసులు కేసులుకనిపించాయి.
నార్త్ జోన్ లో కొరొనా ఇప్పటి వరకు 13 కేసులతో తక్కువ తీవ్రత కనిపించింది.
నగరంలో ఎక్కువగా కేసులు ఉండటంతో కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు.