ఆంధ్ర జడ్ పి ఎన్నికలకు హైకోర్టు బ్రేక్, నిమ్మగడ్డ సూచన పాటించని నీలం సాహ్ని

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్  నీలం సాహ్నికి రెండో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె మొదటి సారి ఆమె జడ్ పిటిసి ఎన్నికల గురించి ఏర్పాటు చేయాలనుకున్న సమావేశాన్ని ప్రతిపక్ష పార్టీలు బ హిష్కరించాయి. రెండోది ఇపుడు హైకోర్టు రూపంలో తగిలింది. ఆమె నిర్వహించాలనుకున్న జడ్, జడ్ పిటిపి ఎన్నికలను జరపడానికి వీళ్లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఎన్నికల జరిపేందుకు సుప్రీంకోర్టు చెప్పిన నాలుగువారాల గడువు ఉండాలని. ఈ నియమాన్ని నీలం సాహ్ని పాటించలేదని చెబుతూ హైకోర్టు ఎన్నికలను నిలిపివేసింది. ఎన్నికలకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకండా రెండు రోజుల శెలవులు కూడా ప్రకటించింది.

నిజానికి తాను జడ్ పి ఎన్నికల జరపలేకపోవడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పిన కారణాలో 40 రోజుల మాండేటరీ గడువు కూడా ఒకటి. తాను నెలాఖరున రిటైరవుతున్నందున , ఎన్నికలను నిర్వహించేందుకకు 40 రోజులు గడవు ఇవ్వాలి కాబటి ఈ ఎన్నికలను తాను నిర్వహించలేనని, తన తర్వాత వచ్చే కమిషనర్ చూసుకుంటారని ఆయన ఒకప్రకటనలో స్పష్టంగా చెప్పారు. ఈ గడువుతో పాటు ఎన్నిలక సిబ్బందికి వాక్సినేషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకతను కూడా నిమ్మగడ్డ వుదహరించారు.
The 4 week Model Code of Conduct which is a prerequisite as well as the ECI observations concerning poll staff and vaccination programme, rule out holding of elections under my charge as my tenure is coming to an end shortly i.e.,31.03.2021. These responsibilities are best shouldered and addressed by my
successor. Under these compelling circumstances, the Commission will not be announcing a schedule in case of MPTC/ZPTC elections, అని నిమ్మగడ్డ చెప్పారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని దీనిని గమనించకపోవడం ఆశ్చర్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *