భారీ వర్షాలున్నాయ్ జాగ్రత్త, వాతావరణ హెచ్చరిక

 తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాగల 48 గంటల్లో బలపడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది.
• దీని ప్రభావంతో ఈ రోజు (జూన్11) కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు , మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని  విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఆయన చేసిన హెచ్చరికలు:
• తీరంవెంబడి గంటకు 40-50 కీ.మీ వేగంతో గాలులు వీస్తాయని సముద్రం అలజడిగా ఉంటుంది కావున మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు.
• జూన్12న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు మిగిలిన చోట్ల తేలకపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలో చెదురు మదురుగా తేలకపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.
• జూన్13న కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ తేలకపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.
• భారీ వర్షాలు ఉన్నందున కోస్తాంధ్ర జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల శాఖ
• లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
• ఈ మూడు రోజులు మెరుపులు ,ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు పిడుగుల పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
• ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, చెరువుల వద్ద, నీటి కుంటల దగ్గర, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.