బంగారుకు రెక్కలొచ్చాయ్… 10 గ్రా. రు.65 వేల దాకా ఎగరొచ్చంటున్నారు

బంగారు ధరలు ఆకాశంలోకి అలాఅలా ఎగిరిపోతున్నాయి. చైనాతో గొడవలు, డాలర్ బలహీనంగా ఉండటం, బ్యాంకుల వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడంతో నాలుగు డబ్బులు సంపాయించే మార్గాలన్నీ మార్కెట్లో మూసుకు పోయాయి.దీనితో  ప్రజలంతా తమ పొదుపు మొత్తాలను బంగారు వైపు మళ్లిస్తున్నారు. ఫలితంగా బంగారుధర బుధవారం నాడు పదిగ్రాములు రు.50 వేలు  దాటింది.
ప్రపంచంలో చైనా తర్వాత బంగారు ఎక్కువ కొనుగోలు చేసే దేశం ఇండియాయే. 2020 మొదటి ఆరునెలలు బంగారుకు ‘స్వర్ణయుగమే’అయింది.  మార్చిలో ఒక సారి కిందకు పడినట్లే పడి బంగారు ధరలు సుమారు 25 శాతం పెరిగాయి.  ఈ పాండెమిక్ కాలంలో ఇంతగా పెరుగుదల చూపిన అసెట్లేవీలేవు. అంతర్జాతీయ మార్కట్లో తొమ్మిదేళ్ల కిందట ఒక సారి చేరుకున్న రేటుకు దగ్గరగా  బంగారు  ఎగిరి ట్రాయ్ ఔన్స్ ధర  1,856 .60 డాలర్లకు చేరింది. 2011 సెప్టెంబర్ లో ఒకసారి బంగారు ధరు ట్రాయ్ ఔన్స్ రేటు 1,920 డాలర్ల యింది. ఒక ట్రాయ్  ఔన్స్ అంటే 31.1034768 గ్రాములు.
మార్చినాటితోపాటు స్టాక్ మార్కెట్ కొద్ది గా పుంజుకున్నా, కోవిడ్ అంతర్జాతీయ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉండటంతో ప్రజలు  స్టాక్ నుంచి బంగారు వైపు పరుగుతీస్తున్నారు.
భారతదేశంలో బంగారుధరలెపుడూ అంతర్జాతీయ బంగారు ధరలను బట్టి మారుతూ ఉంటాయి.ఇపుడు అంతర్జాతీయంగా బంగారు ధరలు పెరుగుతూ ఉండటంతో భారత్ లో కూడా బంగారు బాగా పెరుతూ ఉంది.  హూస్టన్ కాన్సలేట్ ను 72 గంటల్లో ఖాళీ చేయాలని అమెరికాను చైనాను ఆదేశించడంతో అంతర్జాతీయ ఉద్రికత్త పెరిగింది. రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు తలెత్తినపుడల్లా బంగారు ధరలు పెరుగుతుంటాయి.ఇపుడు బంగారు ధరలు పెరిగేందుకు చైనా- అమెరికా రాజకీయ ఉద్రిక్తత కూడా తోడ్పడుతుంది
అందుకే ఈ ధరలు ఇంకా పెరిగి, పెరిగి పదిగ్రాముల ధర రు. 65వేలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు.