కౌన్సిల్ చెయిర్మన్ మీద మంత్రి బుగ్గున నిప్పులు

 ఆంధ్రప్రదేశ్  ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్  ఈ రోజు శాసన మండలి చెయిర్మన్ మీద మండిపడ్డారు. మండలిలో వైసిపికి బలం లేకపోవడంతో వికేంద్రీకరణ, సిఆర్ డిఎ బిల్లులు పాస్ కావడం కష్టమయింది.దానికితోడు సభానియమాలలోని ఉపయోగించుకుని71 నియమం కింద ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని బాగా ఇరుకున పెట్టింది. చట్ట సభల్లోమెజారీటీ కి, మెజారిటీ లేకపోవడానికి తేడా ఏమిటో  ఈ శాసన మండలి చూపించింది.దీనితో మంత్రి బుగ్గున మండిపడ్డారు . ఏపీ చరిత్రలో నేడు బ్లాక్ డే అన్నారు.బహుశా ఈ కౌన్సిల్ ఉంటే ఇక మనం స్వేచ్ఛగా ముందుకు పోలేమనే భావం ప్రభుత్వం ఏర్పడి ఉండవచ్చు. ఈ దెబ్బతో కౌన్సిల్ కు మరొక సమావేశం లేేకుండా  రద్దు చేసే అవకాశం ఉందని వారంలో రోజులుగా మీడియాలో ఉహాగానాలు వినవస్తున్నాయి. బహుశా బడ్జెట్ సమావేశాల్లోపు కౌన్సిల్ ను మూసేసేందుకుచర్య తీసుకోవచ్చు.
బుగ్గన ఇంకా ఏమన్నారో చూడండి
చట్టసభల పై టీడీపీ సబ్యులకు గౌరవం లేదు.
చంద్రబాబు చెప్పినట్లు మండలి చైర్మన్ నడుచుకున్నారు.
గ్యాలరీ లో కూర్చుని చంద్రబాబు చైర్మన్ కు డైరక్షన్ ఇచ్చారు.
వికేంద్రీకరణ, సమాన  అభివృద్ధి కోసం తెచ్చిన బిల్లును టీడీపీ అడ్డుకుంది.
శాసనసభ ఆమోదించినా మండలి వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధం.
బీఏసీలో యనమల మాట్లాడిన దానికి చేసిన దానికి పొంతన లేదు.
రూల్ 71 అడ్డంపెట్టుకొని సభను పక్కదారి పట్టించారు.
రూల్ 71 అనేది ఎందుకు ఉందొ టీడీపీ సభ్యులకు తెలుసా.
రెండు రోజులుగా బిల్లును ఓటింగ్ కు పెట్టకుండా కావాలని అడ్డుకున్నారు.
రూల్స్ కు విరుద్ధంగా సభలో సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేశారు.
బీఏసీలో తీసుకున్న చైర్మన్ ,టీడీపీ సభ్యులు నిర్ణయాన్ని విస్మరించారు.
గ్యాలరీలో కూర్చున్న చంద్రబాబు మాటలు విని మండలి ఛైర్మన్ నడుచుకుంటారా.
చైర్మన్ గా తప్పులు చేసి విచక్షణాధికారాలను ఉపయోగించానని ఎలా చెప్తారు.
సభను చైర్మన్ రాజకీయాల కోసం వినియోగించారు.
13జిల్లాల అభివృద్ధి కోసం శాసనసభలో ఆమోదించిన బిల్లులను మండలి చైర్మన్ ఎలా వ్యతిరేకిస్తారు.