ఎన్నికల కోడ్ కొరడా ఝళిపిస్తున్న నిమ్మగడ్డ

అమరావతి : పంచాయతీ ఎన్నికలలో ఎన్నికల కోడ్ ని చాలా కఠినంగా అమలు చేసేందుకు  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు తీసుకుంటున్నారు.

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అంతా దారికొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు సహకరించేందుకు సిద్దమయింది. కోర్టు తీర్పుబలంతో నిమ్మగడ్డ ఒక నాటి శేషన్ ను తలిపిస్తారేమో చూడాలి. ఇప్పటికయితే, రాష్ట్రంలో ఉన్న రాజకీయ వైషమ్య వాతావారణంలో ఎక్కడా ఎవరూ ఎన్నికల ప్రక్రియను పెడదారి పట్టించకుండా ఉండేందుకు, ఎక్కడా ఏ అధికారి, ఏ ప్రభుత్వోద్యోగి ఏ రాజకీయ పార్టీకి సహకరించకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అనుమానాస్పద ప్రవర్తన ఉన్న అధికారులందరిని బదిలీ చేయాలని రాష్ట్రప్రభుత్వాన్నికోరుతున్నారు. ఇది ఉన్నత స్థాయిలోనే కాదు, గ్రాస్ రూట్ గ్రామస్థాయిలో కూడా లోకల్ రాజకీయ నాయకులెవెరూ ఉద్యోగులను ప్రభావితం చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్‍ తీరు ను రమేష్ కుమార్ అభిశంషించారు.  2021 ఓటర్ల జాబితా ప్రచురణలో  వారిరువురు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ద్దరు విధులు నిర్వహించడానికి అనర్హులని  ఎస్‍ఈసీ పేర్కొన్నారు.  ఇద్దరిని తొలగించాలని ప్రొసీడింగ్స్ జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఓటర్ల జాబితా ప్రచురిస్తామని కోర్టుకు హామీ ఇచ్చి కీలకమయిన ఆ బాధ్యతలను నిర్వహించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంతో వారవురు ఎన్నికల విధులను నిర్వహించేందుకు అనర్హులని, వారి స్థానాలలో మరొకరిని నియమించాని ప్రభుత్వానికి సూచించారు.

ఇందులో భాగంగా ఆయన  గ్రామ వలంటీర్లతో పాటు, గ్రామ సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధులకు దూరంగా పెట్టారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఎన్నిల విధానానికి దూరంగా ఉండాలని  రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

వాలంటీర్లంతా  ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లను వాపసు చేయాలని స్పష్టం చేశారు.

అలాగే వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని, కనిపించరాదని పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *