చల్లటి వార్త: ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ లలో కరోనా తగ్గుతాంది: AIIM డైరెక్టర్

కరోనా కూపాలుగా ఉన్న మూడు నగరాలలో కరోనా గ్రాఫ్ చదునవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా ఇంతవరకు దేశానికంతటికీ ఆందోళన కల్గించిన మూడు నగరాలు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ లలతో కరోనా గ్రాఫ్ దిగుతూ ఉందని న్యూఢిల్లీలని అఖిల భారత వైద్యశాస్త్రాల సంస్థ (AIIMS) డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా  చల్లటి కబురందించారు. గులేరియ భారత కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ సభ్యుడు కూడా.
న్యూ స్ 18 తో మాట్లాడుతూ  దేశంలోఒక్కో ప్రాంతం ఒక్కో టైలో కరోనా ఆశాశాన్నంటుతుందని ఆయన చెప్పారు. ఇలా తారాస్థాయికి (పీక్ )కు కరోనా కేసులు చేరాక తగ్గు ముఖం పెడతాయి. ఢిల్లీలో ఇపుడిది జరుగుతూ ఉందని డాక్టర్ గులేరియా చెప్పారు. “Delhi is one such state where flattening of the curve is happening. It is happening in other area of the country as well. Mumbai, Ahmdabad and certain parts of South are showing decline. They seem to have reached a plateau and are showing downward trend,” అని ఆయన చెప్పారు.
 అయితే, కొన్ని ప్రాంతాలలో కేసులుపెరుగుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. బీహార్ , అస్సాం రాష్ట్రాలలో ఇంకా ఉధృతంగా చర్యలు తీసుకోవలసి ఉంది. కేసులు తగ్గుతున్నట్లనిపించినా మన తీసుకునే చర్యలు ఉధృతంగా నే ఉండాలని ఆయన చెప్పారు.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన ప్రాంతాలలో ప్రజలు భౌతిక దూరం నియమాలను ఉల్లంఘిస్తున్నారని, దీని వల్ల మరొక సారి కరోనా దాడి చేస్తుందని ఆయన హెచ్చరించారు.
అందుకే కేసులు ఎక్కువగా ఉన్న చోట కఠిన చర్యలు తీసుకోవలసిందే. అక్కడ కఠినంగా లాక్ డౌన్ అమలుచేయడమే కాదు,ఇంటింటి సర్వే చేసి కేసులను కనుక్కుని క్వారంటైన్ కు పంపించి కరోనా కేసులు వ్యాపించకుండా చేయాలి. ఈ ప్రాంతాలను వెంటనే కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించాలి, అని ఆయన చెప్పారు.
“If there is any area where there is large number of cases, we have to have aggressive containment strategies. It could include not only a lockdown but house to house surveillance so that you can decrease number of cases and contain the spread in that area. But identifying cases and isolating them along with a lockdown becomes very important.”
ఇండియాలో కరోనా మృతుల సంఖ్య తక్కువగా ఉండటం గురించి చెబుతూ బహుశా భారతీయులు తీసుకునే బిసిజి వ్యాక్సిన్ వల్ల ఈ ఇలా జరుగుతూ ఉండవచ్చని డాక్టర్ గలేరియా అన్నారు.
దీనికి మరొక ధియరీ ఉందని కూడా చెప్పారు.
“ఆసియా దేశాలలో ప్రజలకు సోకుతున్నది కరోనా వైరస్ సాధు (milder form) రూపం. దీని వల్ల ఫ్లూ వంటి లక్షణాలు మాత్రమే ఉంటాయి. ఆసియా దేశాల్లో సంచరిస్తున్న ఈ వైరస్ సోకినందున ఇక్కడి ప్రజల్లో క్రాస్ ప్రొటెక్టివ్ (cross-protective immunity) కి దారి తీస్తుంది.   దీని వల్ల కూడా మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది,’ అని డాక్టర గులేరియా చెప్పారు.
రుతుపవనకాలంలో కరోనా వైరస్ పెరుగుతుందా అని ప్రశ్నించినపుడు , కరోనా వైరస్ పూర్తిగా కొత్తది. దాని ప్రవర్తన వర్షాకాలంలో ఊహించడం కష్టమని ఆయన అన్నారు.
1980 లో ఇన్ ఫ్లుయంజా పాండెమిక్ ఎదురయినపుడుమొదట తగ్గి శీతాకాలంలో మరొక సారి విజృంభించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎందుకైనా మంచిది వచ్చే శీతాకాలంలో బాగా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.