పోలీసులా డెకాయాట్లా, సీపీఐ నారాయణ ఆశ్చర్యం

విజయవాడ: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అమరావతి పోలీసులు మహిళలు మీదకు రెచ్చి పోవడం మీద ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ రోజు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ రాజధాని మీద నివేదిక సమర్పించడం మీద ఆయన స్పందించారు. ఆయన ఏమన్నారంటే…
బోస్టన్ రిపోర్ట్ లో బీసీజీ సభ్యుల సంతకాలు మాత్రమే ఉంటాయి.ఆ కమిటీలు ఇచ్చే రిపోర్టులు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు.జగన్ చెప్తే విజయసాయిరెడ్డి ఆ రిపోర్ట్ రాస్తాడు. బీసీజి వాళ్లు సమర్పిస్తారు.
అసెంబ్లీ సచివాలయం ఒక దగ్గరే ఉండాలి.మొగుడు ఒక చోట..పెళ్ళాం ఒక చోట ఉండకూడదు.రాజధాని మార్చే రాజకీయ హక్కు జగన్ కి లేదు.రాజధానిని మారుస్తామని జగన్ ఎన్నికల ముందు చెప్పలేదు.ప్రభుత్వం సమాధులు సిద్ధం చేసింది…అవి రైతులకా..ప్రభుత్వానికా త్వరలో తెలుస్తుంది.
10 తేదీ తరువాత కోర్టు మెట్లు జగన్ ఎక్కాలి..అప్పుడు పరిపాలన ఎలా చేస్తాడు?మందడం లో మహిళలపై దాడులు దారుణం..వీళ్ళు పోలీసులా…డెకాయిట్లా ?