ఈ ఏడాది ఇంటిపన్ను రద్దు చేయండి: GHMCకి రేవంత్ విజ్ఞప్తి

ప్రజలంతా కరోనా కష్టాలు ఎదుర్కొంటున్నందున ఒక  ఏడాది పాటు గ్రేటర్ హైదరాబాద్ లో ఇంటిపన్ను రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపి, టిపిసిసి వర్కింగ్ ప్రెశిడెంట్ రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసికి విజ్ఞప్తి చేశారు.
ఈ రోజు జీహెచ్ఎంసీ కమీషనర్ ను కలసి ఈవిషయం చర్చించారు.ఒక వినతిపత్రం సమర్పించారు.
 కరోనా వల్లా చాలా మంది ఆదాయం లేకుండా పోయిందని,  పేద, మధ్యతరగతి కుటుంబాల లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయాయనిచెబుతూవారికి ప్రస్తుతానికి  ఇంటి పన్ను కట్టే స్థోమత లేదని ఆయన కమిషనర్ కు చెప్పారు.
‘ఉన్నత వర్గాల నుంచి వసూలు చేసినా అభ్యంతరం లేదు.ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఉద్యోగుల జీతాల్లో కోట విధించారు. స్వయం ఉపాధిలో ఉన్న పేద, మధ్యతరగతి వారికి లాక్ డౌన్ సమయంలో ఆదాయం లేదు. ఈ నేపథ్యంలో ఇంటిపన్నుల మీద కరెంట్ బిల్లులపైనా ప్రభుత్వ వైఖరి మారాలి. పేదలమీద పై భారం పడుతుంది. త్వరగా కౌన్సిల్ సమావేశం ప్రజలకు ఉపశమనం కల్పించేలా ఒక నిర్ణయం తీసుకోవాలి,’ అని కమిషనర్ ను కోరారుా.