జీతాలు ఎగ్గొడుతున్న ప్రైవేటు కాలేజీలపై చర్య లేవీ? : వంశీ చంద్ రెడ్డి

తెలంగాణ ఏర్పడిన ఆరేళ్ల  తరువాత కూడా తెలంగాణా లక్ష్యం నెరవేరడం లేదని,ముఖ్యంగా యువకులకు సరైన ఉపాధి దొరకక నిరాశకు లోనవుతున్నారని, తుంగతుర్తి  మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వంశీచంద్ రెడ్డి వ్యాఖ్యానించారు
‘ఉద్యోగాల కోసం తెలంగాణ పోరాటం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినా కూడా తెలంగాణ లో యువత కు ఉద్యోగాలు రాలేదు.వేలాది మంది అనేక ఉన్నత చదువులు చడదువుకున్నా కూడా ఉపాధి పనులు చేసుకొని పని చేస్తున్నారు,’ అని వంశీ అన్నారు.
గత కొద్దిరోజులుగా వంశీ ప్రవేటు కాలేజీలలో జీతాలు రాని టీచర్లు గురించి పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. లాక్ డౌన్ పేరు చెప్పి యాజమాన్యాలు జీతాలు ఎగ్గొడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ  కార్పొరేట్ యాజమాన్యాలతో ప్రభుత్వ పెద్దలకు సంబంధం ఉందన్న అనుమానం ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
‘ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీతాలు రావడం లేదు. అన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలకు పూర్తిస్థాయి వేతనాలు ఇవ్వాలి. అన్ని రకాల ప్రైవేట్ విద్య సంస్థలలో సుమారు 7 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.వాళ్లందరికీ పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వాలి. లేకపోతే వారిపై చర్యలు తీసుకోవాలి,’ అని వంశీ చంద్ రెడ్డి డిమాండ్ చేశారు.
జి ఓ 45 లో ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులకు ఫీజు లు వసూలు చేయవద్దని ఉంది. దానికి మేం మద్దతు ఇస్తున్నాము. కానీ గత రెండేళ్ల ఫీజ్ రియంబర్స్ మెంట్ బకాయిలు కళాశాలకు ఇస్తే కాలేజీలకు ఉపశమనం ఉంటుందని ఆయన అన్నారు.
‘ఆంధ్ర  ప్రదేశ్ ప్రభుత్వం రు. 4,500 కోట్లు ఫీజు బకాయిల కింద ఇచ్చింది. తెలంగాణ ఆ రాష్ట్రం కంటే మనం ధనిక రాష్ట్రం కాబట్టి వెంటనే ఫీ రీయంబర్స్ మెంట్ బకాయీలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది,’ అని ఆయన అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
లక్షల మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ జీతాలు ఇవ్వడంలేదు.
రెండు కేటగిరిలుగా ప్రైవేట్ పాఠశాలలను విభజించి కార్పొరేట్, ఇంటర్ నేషనల్ స్కూల్ ఒక కేటగిరి గా ఉపాధి, ఉద్యోగాల కోసం స్కూల్ పేట్టుకొన్న స్కూల్ ను ఒక కేటగిరి గా చేయాలి.
రెండో కేటగిరి స్కూళ్లను ప్రభుత్వం ఆదుకోవాలి. మొదటి కేటగిరి స్కూల్ లో యాజమాన్యం జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలీ.
ఇంటర్, డిగ్రీ కాలేజీలలో విద్యార్థులకు మెస్ చార్జీలు 500 రూపాయలు 10 నెలల కోసం కాకుండా 12 నెలలకు ఇవ్వాలి.
ఇంటర్, డిగ్రీ, పిజి కళాశాలలకు చెందిన 2019 -20 సంవత్సరాల ట్యూషన్ ఫీస్, మెస్స్ చార్జీల బకాయిలు విడుదల చేయాలి.
ఇంటర్ వాల్యూవేషన్లో ఉన్న 20 వేల లెక్క్చరర్లకు ఆరోగ్య భీమా అందించాలి.