శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి జగన్ (ఫోటో గ్యాలరీ)

తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పంచెకట్టు, తిరునామంతో   శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.
బుధవారం రాత్రి తిరుమలేశునికి జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవము రోజున పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి  ప్రభుత్వం బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు.  ఇక్కడ నుండి బయలుదేరి శ్రీ వారి ఆలయమునకు చేరుకొని శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించి  శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రులు  నారాయణ స్వామి,  ఆళ్ళ నాని, రాష్ట్ర మంత్రులు  పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి,  వెల్లంపల్లి శ్రీనివాస్ , శ్రీమతి మేకతోటి సుచరిత,  గౌతమ్ రెడ్డి, వేణుగోపాల కృష్ణ , కొడాలి నాని, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎ పి ఐ ఐ సి ఛైర్మన్ శ్రీమతి ఆర్కే.రోజా, ఎంపీ లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,  మిధున్ రెడ్డి, తిరుపతి ఎం ఎల్ ఎ కరుణాకర రెడ్డి, సత్యవేడు, శ్రీకాళహస్తి, మదనపల్లి ఎం ఎల్ ఎ లు ఆదిమూలం, బియ్యపు మధుసూదన్ రెడ్డి, నవాజ్ భాష, ఇంచార్జి కలెక్టర్ మార్కండేయులు, టీటీడీ ధర్మకర్తల మండల అధ్యక్షులు వై.వీ.సుబ్బారెడ్డి, కార్యనిర్వాహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, అధనపు ఈఓ ఎ.వి.ధర్మా రెడ్డి, జెఈఓ బసంత్ కుమార్, సి వి ఎస్ ఓ గోపినాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ ఎ.రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Like this story? Share it with a friend!