చైనా గురువారం నాడు అంగారక అన్వేషణ్ (Mars Probe) విజయవంతంగా ప్రయోగించింది. పూర్వం కోల్డ్ వార్ కాలంలో అంతరిక్షం మీద పట్టుకోసం అమెరికా, సోవియట్ రష్యాలు పోటీ పడేవి. చంద్రుడిమీది మొదట కాలుమోపి అంతరిక్షం మీద ఆధిపత్యం ప్రకటించాలని రెండు దేశాలు పడినతాపత్రయం అంతా ఇంతాకాదు. సోవియట్ కమ్యూనిస్టు ప్రభుత్వం కూలిపోయాక ఆ పోటి నుంచి రష్యా విరమించుకున్నట్లే. రష్యా స్థానంలోకి మరొక కమ్యూనిస్టు దేశం చైనా వచ్చి చేరింది. ఈరోజు మార్స్ ప్రోబ్ ను విజయవంతంగా ప్రయోగించి, అంగారక గ్రహ అన్వేషణలో అమెరికాకంటే చైనా వారంరోజులు ముందు నిలబడింది. ఎందుకంటే, అమెరికా ఈ నెలాఖరు ప్రయోగించేందుకు సిద్ధమవుతూ ఉంది.
ఈ రోజు చైనా ప్రయోగించిన మార్స్ ప్రోబ్ (Mars probe) పేరు తియాన్ వెన్ -1( Tianwen-1) . దక్షిణ చైనా హైనాన్ రాష్ట్రం వెన్ చాంగ్ స్పేస్ లాంచ్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. లాంగ్ మార్చ్ -5 Y-4 రాకెట్ మార్స్ ప్రోబ్ ను అంతరిక్షంలోకి తీసుకుపోయింది. ఈ రాకెట్ చాలా శక్తివంతమయిందని చెబుతారు. ప్రయోగించిన 2,000సెకన్ల తర్వాత మార్స్ ప్రోబ్ విజయవంతంగా భూమి-అంగారక ట్రాన్సఫర్ ఆర్బిట్ లోకి చేరింది.అంగారక గ్రహాన్ని రెండ్ ప్లానెట్ అంటారు.దీనికి కారణం ఇక్కడ ఐరన్ ఆక్సైడ్ రసాయనిక చర్యల సౌరకుటుంబలోని ఇతర గ్రహాల్లాగా కాకుండా ఎర్రగా కనిపిస్తుంది. అంగారకుడి దినం కూడా భూమి లాగా 24.6229 గంటలు. అంగారక గ్రహం మీద నాలుగు కాలాలున్నాయి. మార్స్ వంపు (25 డిగ్రీలు) భూమి వొంపు (23.5 డిగ్రీలు) వొకలాగే ఉంటాయి
2021 ఫిబ్రవరిలో తియన్ వెన్-1 అంగాకరకాకర్షణ క్షేత్రంలోకి ప్రవేశిస్తుందిని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) పేర్కొంది. అంటే ప్రయోగించిన ఏడు నెలల తర్వాత మే నెలలో మార్స్ ప్రోబ్ లోని రోవర్ అంగారకుడి దక్షిణాన యుటోపియా ప్లానిషియా (Utopia Planitia) అనే ప్రాంతం వద్ద మెల్లిగా (soft land) దిగుతుంది.
ఈ సాప్ట్ లాండింగ్ విజయవంతమయితే, మార్స్ మీద మొదటి ప్రయోగంలోనే ఆర్బిటింగ్, లాండింగ్, రోవింగ్ మూడు లక్ష్యాలను విజయవంతంగా పూర్తి అయిన ప్రయోగంగా చైనా ప్రయోగం మిగిలిపోతుంది.
మనిషి అంతరిక్ష యాత్రలో ఇలా తొలిసారే ఏ ప్రయోగమూ మూడులక్ష్యాలలో విజయవంతం కాలేదు. చంద్రమండల యాత్ర కూడా ఎన్నో వైఫల్యాలతోనే మొదలయింది.
https://trendingtelugunews.com/top-stories/features/mans-moon-missions-faced-series-failures-before-it-took-off/
ఈ సారి చైనా మార్స్ ప్రోబ్ విజయవంతమయితే ఏకధాటిని ప్రయోగం విజయవంతమయిన ఘనత చైనాకు దక్కుతుందేమో చూడాలంటే మరొక ఏడునెలలాగాలి.
అంతర్జాతీయ సహకారంతోనే ఈ మార్స్ ప్రోబ్ యాత్ర సాధ్యమయిందని చెప్పేందుకు లాంగ్ మార్చ్ -5 Y-4 బాడీ మీద అంతర్జాతీయ స్పేష్ ఏజన్సీల, అంటే యూరోపియన్ స్పేస్ ఏజన్సీ, ఫ్రెంచ్ స్పేస్ ఏజన్సీ, ఆస్ట్రియన్ రీసెర్చ్ ప్రమోషన్ ఏజన్సీ లోగోలు ముద్రించారు. ఇందులో నాసా లోగో ఉందన్న విషయాన్ని గ్లోబల్ టైమ్స్ రాయలేదు. బహుశా చైనాతో కలసి పనిచేస్తున్నస్పేస్ ఏజన్సీల లోగో లు మాత్రమే ముద్రించారనుకోవాలి.
చైనా ముందున్న సవాళ్లు
సౌర వ్యవస్థలో అంగారకుడు భూమికి అంత్యంతసమీపాన ఉన్న గ్రహం. భూమితో పోలిన వాతావరణ ఉంటున్న గ్రహం. 2020 జూన్ నాటికి వివిధ దేశాలు మార్స్ అన్వేషణ కోస 44 సార్లు ప్రోబ్స్ పంపే ప్రయత్నాలు చేశారు. ఇందులో 24 విజయవంతమయ్యాయి. అంగారకుడికి భూమికి మధ్య దూరం 55 మిలియన్ కి.మీ. 26 నెలల కొకసారి ఈ రెండు గ్రహాలు దగ్గరపడతాయి. అందువల్ల జూలై , ఆగస్టునెలలు మాత్ర మే మార్స్ ప్రయోగాలకు అనుకూలం. 24 ప్రయోగాలు విజయవంతమయినాయని చెప్పుకున్న మొదటి ప్రయత్నంలోనే మూడులక్ష్యాలను అంటే అంగారకుడి చుట్టూర ప్రదక్షిణ చేయడం,అంగారకుడిమీదకి వాహనాన్ని సురక్షితంగా దించడం, అక్కడ వాహనాన్ని తిప్పడం చేసిన దేశమేదీ లేదు. అదువల్ల చైనా ప్రయోగానికి సవాళ్లు ముందున్నాయని గోబల్ టైమ్స్ రాసింది.
అంగారకుడి కక్షలోకి ప్రవేశించాక ఏడు నిమిషాల్లో ఈ ప్రోబ్ సురక్షితంగా అంగారకుడిమీద వాలాలి. ఇదే చాలా కీలకమయిన దశ. భారత చంద్రయాన్ కూడా విఫలమయింది ఇలాంటి దశలోనే. దీని సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు. ఈ ఏడు నిమిషాలలో ప్రోబ్ గంటకు 20 వేల కిలో మీటర్ల పైబడి ఉన్న వేగాన్ని సున్నాకు తీసుకురావాలి. ఇదే ప్రోబ్ కు సవాల్. ఇక్కడ ప్రోబ్ ఉపరితలం అక్కడ పుట్టే వేడికి తట్టుకునే శక్తి ఉండాలి. దీనికోసంచైనా అమెరికా అపోలో అంతరిక్ష నౌక కంటే దృడయిన మెటీరియల్ తయారుచేసిందట. వేగం పతనమయ్యే టపుడు ఎదరయ్యే సమస్యలను తట్టుకునేట్లు మార్స్ ప్రోబ్ ను తయారు చేశామని చైనా ధీమా గా ఉంది. ఏమవుతుందో చూడాలి. చైనా తర్వాత అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మార్స్ మిషన్స్ పంపడానిక సిద్ధంగా ఉన్నాయి. జూలై 30న తన మార్స్ మిషన్ (Perseverance) కు అమెరికా ముహూర్తం పెట్టుకుంది. రష్యా యూరోప్ మార్స్ యాత్ర 2022 నాటికి వాయిదా పడింది.
If you like this story, please share it with a friend!