అప్పులకోసం రైతు మెడకు ఉరితాడు చుడుతున్నారు: చంద్రబాబు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉచిత విద్యుత్ తీసేసి ‘నగదు బదిలీ’ పేరుతో  రైతు మెడకు ఉరితాడు చుడుతున్నాడని  మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్ర బాబు నాయుడు అన్నారు. ఈ విధానాన్ని తాము తీవ్రంగద వ్యతిరేకిస్తున్నామని అంటూ  రాష్ట్రంలో ఉచిత విద్యతు పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగదు బదిలీ పేరుతో వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకించారు. నగదు బదిలీపథకానికి సంబంధించిన జివొ 22 ను వెంటనే ఉపసంహరించుకోవాలని చంద్రబాబు నాయుడు డి మాండ్ చేశారు.
‘రైతులకు సోలార్ పవర్ ఇచ్చేందుకు కృషిచేశాం. రైతులకు రిమోట్ కంట్రోల్ కూడా ఇచ్చాం. దీంతో రాత్రిళ్లు వెళ్లే పరిస్థితి ఉండదు. నా పాదయాత్రలో చూశాను. గత ప్రభుత్వాల్లో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. పాములు కరిచి అనేక మంది రైతులు చనిపోయారు. ఆ బాధలు విన్నా. 2014 తర్వాత ఇలాంటి బాధలు లేవు. 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీలు పెంచకుండా మాట నిలబెట్టుకున్నాం. ఇప్పుడున్న ధర కంటే కూడా ఇంకా తగ్గుతుంది. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం తప్ప పెంచబోం అని మేం చెప్పడం జరిగింది. వైసీపీ రెండు సార్లు దొంగచాటుగా ధరలు పెంచింది. మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు- ఇది ముమ్మాటికీ రైతులకు వెన్నుపోటే,’ అని ఆయన వ్యాఖ్యానించారు.

రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని మొదట ఆలోచన చేసిందే ఎన్టీఆర్ అని చెబుతూ  ఉచిత విద్యుత్ పేరుతో వైసీపీ ప్రభుత్వం నాటకాలుడుతూ ఉందని, మీటర్లు పెట్టాలన్న నిర్ణయంతో మెట్ట ప్రాంతాలు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన వ్యాఖ్యానించారు.

ఉచిత్ విద్యుత్ బాటలువేసి విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చిన పార్టీ, ఈరంగాన్ని రైతులను కాపాడుకునేందుకు తెలుగు దేశం పార్టీ పోరాడుతుందని ఆయన ప్రకటించారు.
‘ఇది రైతులకు సంబంధించిన అంశం ప్రభుత్వం దాయాదాక్షిణ్యాలతో ఇచ్చేది కాదు. మీటర్లు పెట్టడం అంటే రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే. రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా అప్పుచేస్తున్నది. మరిన్ని అప్పుల తెచ్చుకునేందుకు 18 లక్షల మంది రైతుల్ని మోసం చేయడానికి వెనకాడటం లేదు,’ అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
ఎన్నికల ముందు ఏం చెప్పారు..జగన్ ఇప్పడు ఏమి చేస్తూన్నారని ప్రశ్నిస్తూ, జగన్ తన పబ్బం గడవుకోవలని అనుకుంటున్నాడు తప్ప రాష్ట్రం, రైతులు బాగుపడాలని కోరుకోవడం లేదని విమర్శించారు.
‘గంటకు రూ.9 కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారు.దీనితో జగన్ చేతగాని తనం బయటపడుతున్నది.ఏపీకి పెట్టుబడులు రావటమే  లేదు.చేతగాని విధానాలతో రాష్ట్ర పరువు, ప్రతిష్ట పోయాయి. నాలుగు నెలల్లో 80 శాతంపైగా అప్పులు చేశారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నంబర్ వన్..ఇప్పడు జగన్ హయాంలో ఎటు పోతుందో తెలియడం లేదు,’ అని ఆయన విమర్శించారు.
విద్యుత్ రంగంలో సంస్కరణలకు నాంది పలికిందే టీడీపీ,  విద్యుత్ పై మాట్లాడే హక్కు టీడీపీకి ఉంది అని చెబుతూ, వైసీపీ సర్కార్ నయవంచన రోజుకోకటి బయటపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
మీటర్లు పెట్టాలన్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ  తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన హెచ్చరించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
ఉచిత విద్యుత్ రైతులు పోరాడి సాధించుకున్న హక్కు. రైతులకు టీడీపీ హయాంలో నిరంతరం సరఫరా చేశాం. రైతుల వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు.
అప్పులు చేసిప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నారు. వ్యవసాయంపై మెదటి సారి బడ్జెట్ తీసుకొచ్చిన రాష్టం ఏపీ.  టీడీపీ రైతుల పక్షాన ఉంటుంది. మోసాలు చేసే పార్టీకి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఎస్సి, ఎస్టీలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిన ఏకైక పార్టీ టీడీపీ.
వైసీపీ సర్కార్ రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచింది.కోర్టులు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా జగన్ తీరు మారడంలేదు. కోర్టు కేసుల నుంచి బయటపడేందుకు  రు.100 కోట్లు లాయర్ల కోసం ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా ఒక్క తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడం లేదు..