దుర్వార్త : 10 వేల ఉద్యోగులకు ఉద్వాసన చెప్పనున్న బష్ ఇండియా

ఆటోమొబైల్ విడిభాగాలు తయారు చేసే బష్ ఇండియా (Bosch India) దాదాపు పది వేల ఉద్యోగాలను కోత పెట్టాలనుకుంటున్నది.బష్ ఇండియా, జర్ననీకి చెందిన రాబర్ట్ బష్ జిఎంబిహెచ్ కు అను బంధ సంస్థ.దక్షిణాసియా ప్రాంతంలో అమ్మకాలుపడిపోవడంతో ఈ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగాల కోత వచ్చే నాలుగేళ్ల పొడవునా తగ్గిస్తూపోతారు. ఇందులో 10 శతం అంటే 3700 ఉద్యోగాలు వైట్ కాలర్ క్యాటగరిలో ఉంటాయి. మరొక 6300 బ్లూ కాలర్ ఉద్యోగాలుంటాయని కంపెనీ ప్రతినిధి ఒకరు బెంగుళూరులో వెల్లడించా4రు.
‘మొత్తం ఆటోమొబైల్ పరిశ్రమాలలో పెనుమార్పు సంభవిస్తూ ఉంది. దీనిని దృష్టిలో పెట్టకుని, కంపెనీ కష్టాల్లో పడకముందే ఇల్లు చక్క బెట్టుకోవాలనుకుంటున్నామని బస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌమిత్ర భట్టాచార్య వెల్లడించారు.
‘కార్లు డిమాండ్ పడిపోవడంతోతయారీ దారులు ప్రపంచవ్యాపితంగా దాదాపు 80వేల ఉద్యోగాలు కోత పెట్టాలనుకుంటున్నారు. దీని ప్రభావం ఆటోవిడిభాగాలు తయారుచేసే కంపెనీల మీద కూడా పడుతుంది. ఇండియాలో 2019లో అమ్మకాలు బాగా పడిపోయాయి. వీటినుంచి కోలుకోవాలంటే రెండుమూడేళ్లు పడుతుంది. ఈ పరిస్థితి రావడానికి కారణం, ఎలెక్ట్రిక్ కార్లు తయారవుతూ ఉండటం, నిధుల కొరత, ఆర్తిక మాంద్యం, ’ అని ఆయన పేర్కొన్నారు.
2019 సెప్టెంబర్ 30 నాటికి బష్ ఇండియా సేల్స్ 66 శాతం పడిపోయాయి. ఈ కంపెనీ షేర్ ధర గత ఏడాది పోలిస్తే 22 శాతం పడిపోయింది. ఎలెక్రిక్ కార్లు వస్తున్నా, అవి , ఇంటర్నర్ కంబషన్ ఇంజిన్ (ఐసిఇ) కార్లు కొద్ది రోజులు కలసి ఉంటాయని, 2030 దాకా 80 శాతం వాహనాలు ఐసిఇవే ఉంటాయని ఆయన భావిస్తున్నారు.