బంగారు హాల్ మార్కింగ్ తప్పనిసరి, జూన్ 15 నుంచి అమలు

వినియోగదారులకు స్వచ్చమయిన బంగారు అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తప్పనిసరి హాల్ మార్కింగ్ (Mandatory Hallmarking) మీద స్టే ఇచ్చేందుకు బాంబే హైకోర్టు బెంచ్ నిరాకరించింది. అయితే, పాండెమిక్ పరిస్థితుల రీత్యా  హాల్ మార్కింగ్ విషయం కఠినంగా వ్యవహారించడం మానుకోవాలని కేంద్రానికి సూచించింది.

గతంలో ప్రకటించిన టైం టేబుల్ ప్రకారం, 2021 జూన్ ఒకటి నుంచి మార్కెట్లో అమ్మే ప్రతి ఆభరణం మీద ప్యూరిటీకి సంబంధించిన హాల్ మార్క్ గుర్తుండాలి. హాల్ మార్క్ లేని ఆభరణాలను విక్రయిస్తే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్  (BIS)చట్టం  2016 సెక్షన్ 29 (2) ప్రకారం ఒక ఏడాది పాటు జైలు శిక్ష ఉంటుంది.

నిజానికి భారత ప్రభుత్వం  2019 నవంబర్ లోనే హాల్ మార్కింగ్ ముద్రించడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది 2021 జనవరి 15 నుంచి అమలులోకి రావలసి వుంది.అయితే, పాండెమిక్ కారణంగా హాల్ మార్కింగ్ వేయించడం సాధ్యం కావడం లేదని వ్యాపారస్తుల వత్తిడి తీసుకురావడంతో ఈ దీనిని  2021 జూన్ ఒకటోతేదీ నాటికి పొడిగించారు.  బంగారు స్వచ్ఛతకు సంబంధించిన సర్టిఫికేటే హాల్ మార్క్ గుర్తు. ఇప్పటి వరకు ఇది కేవలం స్వచ్ఛందగా వేయించుకోవడమే జరిగేది. స్వచ్ఛత విషయంలో చాలా మోసాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో భారత ప్రభుత్వ హాల్ మార్క్ ను తప్పనిసరిచేసింది.

ఇపుడు సెకండ్ వేవ్ కరోనా పరిస్థితుల కారణంగా  హాల్  మార్కింగ్ ను అమలుచేయడాన్ని  2021 జూన్ 15కు పొడిగించారు. అంటే జూన్ 15 నుంచి వర్తకులు 14, 19, 22 క్యారట్ల బంగారు నగలను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ఇపుడు దేశంలో ఉన్న బంగారులో కేవలం 40 శాతానికే హాల్ మార్కింగ్ ఉంది. ప్రస్తుతం దేశంలో 940 అస్సేయింగ్ హాల్ మార్కింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఈకేంద్రాల ద్వారా ఒక ఏడాదిలోనే  14 కోట్ల బంగారు వస్తువులకు హాల్ మార్కింగ్ జరిగింది. వర్తకుల ఈ కేంద్రాలనుంచి తమ ఆభరణాల మీద హాల్ మార్కింగ్ వేయించుకోవాలసి ఉంటుంది.


* GOLD FACTS : బంగారు ప్యూరిటీలో చాలా రహస్యాలున్నాయి…ఇలా


 

పుణేకి చెందిన సరాఫ్ అసోసియేషన్ ఈ పిటిషన్ వేసింది. పటిషన్ ను పరిశీలించిన అనంతరం జస్టిస్ ఎస్ జె కథవాల్లా, జస్టిస్ సురేంద్ర తవాడే ల బెంచ్ స్టే ఇవ్వడం సాధ్యంకాదని చెప్పింది.

ఆర్టిక వ్యవహారాలకు సంబంధించిన చట్టాల అమలు కాకుండా స్టే ఇవ్వడం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను వివరిస్తూ, ప్రస్తుత చట్టం  ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కాబట్టి స్టే ఇవ్వడం జరగదని కోర్టు స్పష్టం చేసింది.

ప్రస్తుతం తమ జిల్లాల్లో అందుబాటులో ఉన్న హాల్ మార్కింగ్ కేంద్రాల నుంచి సాధ్యమయినంత ఎక్కువగా హాల్ మార్కింగ్ ని ముద్రించు కోవడ మొక్కటే మార్గమని కోర్టు అభిప్రాయపడింది.

జ్యుయలర్స్ వాదన

వ్యాపారస్తుల దగ్గిర ఉన్న అభరణాలన్నింటికి జూన్ ఒకటో తేదీలోపు హాల్ మార్కింగ్ వేయించుకునేందుకు అవసరమయిన అస్సేయింగ్ , హాల్  మార్కింగ్ కేంద్రాలు అందుబాటులో లేవని పిటిషనర్ వాదించారు. దేశంలో 733 జిల్లాలుంటే కేవలం 245 జిల్లాల్లో మాత్రమే కేంద్రాలున్నాయని పిటిషన ర్ పేర్కొన్నారు.  దీనికి స్పందిస్తూ దేశంలో చాలా జిల్లాల్లో అస్సేయింగ్ కేంద్రాలున్నపుడు  మొత్తం చట్టం అమలుకాకుండా స్టే కోరడం సబబు కాదని బెంచ్ అభిప్రాయపడింది.

నాగపూర్ బెంచ్ లో కూడా పిటిషన్ 

బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ ముందుకు ఇలాంటి పటిషనే పరిశీలనుకు వచ్చింది. అఖిల భారత జెమ్స్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఈ పిటిషన్ వేస్తూ చట్టం అమలు మీద స్టే ఇవ్వాలని కోరింది. తప్పనిసరి హాల్ మార్కింగ్ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరింది. కాని, జస్టిస్ సునీల్ షుక్రే, జస్టిస్ అవినాశ్ ఘరోటేల డివిజన్ బెంచ్ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కాకపోతే, కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులను వేధించవద్దని కేంద్రానికి సూచించింది.

ఆల్ ఇండియా జెమ్స్, జ్యుయలర్స్ డొమెస్టిక్ కౌన్సిల్ లో 3000 మంది జ్యుయలర్స్, బంగారు షాపులు సభ్యులు ఉన్నారు. జూన్ ఒకటో తేదీ నుంచే హాల్ మార్కింగ్ నియమం అమలు చేస్తే  ఈ ముద్ర పడని సుమారు 6 కోట్ల అభరణాలను అమ్ముకోవడం వ్యాపారాలకు కష్టమవుతుందని, వాటిని నిల్వ చేసినందుకు వ్యాపారులు చట్టరీత్యా శిక్షార్హులు అవుతారని ఈ కౌన్సిల్ పిటిషన్ లో ఆందోళన వ్యక్తం చేసింది.

“ ప్రభుత్వం ప్రకటించిన నియమాలు ఆచరణ సాధ్యంగా లేవు. దేశంలో హాల్ మార్కింగ్ వేసేందుకు తగినన్ని కేంద్రాలు కూడా లేవు. ఇపుడు దేశంలోని జిల్లాలలో  34 శాతం జిల్లాలోనే హాల్ మార్కింగ్ కేంద్రాలున్నాయి. కనీసం 488 జిల్లాల్లో కేంద్రాలు లేవు. దూర ప్రాంతాలలో ఉన్న హాల్ మార్కింగ్ కేంద్రాలకు లాక్ డౌన్ కారణంగా చేరుకోవడం కూడా కష్టంగా ఉంది. దానికి తోడు   14,18,22 క్యారట్ల బంగారు నగలను అమ్మాలని నియమం పెట్టారు. 9,20,23,24 క్యారట్ల గోల్డ్ అమ్మడం మీద నిషేధం ఉంది. తాకట్టు లో ఉన్న ఇలాంటి నగలను విక్రయించడం కష్టమవుతుంది. జూన్ ఒకటో తేదీనుంచి తప్పనిసరి హాల్ మార్కింగ్ నియమం అమలుచేస్తే దేశంలో బంగారు వ్యాపారులంతా కష్టాలు ఎదుర్కొంటారు. అందువల్ల హాల్ మార్కింగ్ చట్టం అమలు కాకుండా స్టే ఇవ్వాలి,’ అని కౌన్సిల్ పిటిషన్ లో కోరింది. అయితే, బెంచ్ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *