డాక్టర్ సుధాకర్ మీద పోలీసుల దాడి హేయం: బంజారా గిరిజన సమాఖ్య

అనంతపురం.. దళిత డాక్టర్ అయినా సుధాకర్ మీద ప్రభుత్వం పోలీసుల చేత దాడి చేయించడం హేమమైన చర్య  బంజారా గిరిజన సమాఖ్య  (BGS)కార్యాలయం నందు రాయలసీమ విభాగం ఖండించింది.
సివిల్ సర్జన్ హోదా ఉన్న డాక్టర్ ని ఇలా టెర్రరిస్టులాగా అరెస్టు చేయడం  మీద  బిజిఎస్ రాయలసీమ  జిల్లాల అధ్యక్షుడు రామవత్ సురేష్ నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
నిన్న జరిగిన డాక్టర్ సుధాకర్ అరెస్టు మీద వ్యాఖ్యానిస్తూ  కరోనా వైరస్ మహమ్మారి రాష్ట్రంలో ప్రబలుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డాక్టర్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, కాని వసతులు లేకుండా పనిచేయాలని డాక్టర్లను ప్రమాదంలోకి  ప్రభుత్వం నెడుతున్నదని  సుధాకర్ గారు ప్రశ్నించడం కూడా తప్పేనా! అని అన్నారు.
 ఆయనను మానసిక వేదనకు గురి చేసి, రోడ్డుపైకి ఈడ్చటం పట్ల  రాష్ట్ర ప్రభుత్వం పైన ఆయన  మండిపడ్డారు..
రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్న లోపాలను ఎత్తిచూపే హక్కు కూడ దళిత, గిరిజనులకు లేదా. డాక్టర్ సుధాకర్  మద్యం మత్తులో ఉన్నారంటూ ,అక్కడ గొడవలు చేస్తున్నారంటూ దళి డాక్టర్ అయిన సుధాకర్  మీద పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదు. ఒక వేళ మద్యం మత్తులో ఉంటే వారి మీద కేసు నమోదు చేసి, వారిని కోర్ట్ ద్వారా శిక్షలు పడేటట్లు చేయాలి కానీ, ఈ విధంగా నడి రోడ్డు మీద పోలీసులు లాఠీ తో దాడి చెయ్యేడం సభ్యసమజానికి మంచి పరిణామం కాదు,’ అని ఆయన అన్నారు.
 ఈ ఘటన మీద వెంటనే సమగ్ర విచారణ జరిపించి,వారి మీద SC, ST అట్రాసిటీ కేసును నమోదు చేసిదోషులను శిక్షించాలని,  రాష్ట్ర హైకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించాలని ఆయన కోరారు.