Home Breaking హర్యానాలో నిజాయితీకి 53వ కొరడా దెబ్బ

హర్యానాలో నిజాయితీకి 53వ కొరడా దెబ్బ

146
0
భారత దేశ చరిత్రలో మరొక రికార్డు. ఈ రికార్డు నెలకొల్పిందీ హర్యానా ప్రభుత్వం.
రాజ్యంగానికి చేతలెత్తి నమస్కారం పెట్టినిన్ను కాపాడుకుంటాం తల్లీ అని నవంబర్ 26న  శపథం చేసిన 24 గంటల్లోనే నిజాయితీకి మారుపేరయిన ఒక ఐఎఎస్ అధికారిని హర్యానా ప్రభుత్వం ఈ రోజు బదిలీ చేసింది.
ఇది ఆయన 28 సంవత్సరాల సర్వీసులో 53వ ట్రాన్స్ ఫర్. ఇది మొదటి రికార్డు కాదులే. గతంలో మరొక ఐఎఎస్ ఆఫీసర్ మొత్తం 34 సంవత్సరాల సర్వీస్ లో 71 సార్లు బదిలీ అయ్యారు. ఆయన పేరు ప్రదీప్ కాస్నీ, ఆయన కూడా హర్యానా ఐఎఎస్ అధికారే.
ఇపుడు మన కథలోని  ఐఎఎస్ అధికారి పేరు అశోక్ ఖేమ్కా. హర్యానా ప్రభుత్వం 27వ తేదీన 14 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో ఖేమ్కా ఒకరు. ఆయన ఇంతవరకు సైన్స్, టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్నారు. ఇపుడాయన్ని అర్కైవ్స్, అర్కియాలజీ, మ్యూజియం శాఖకు మార్చారు. అబ్బే ఇందులో విశేషమేమీలేదు, ఇదీ రొటీన్ ట్రాన్స్ పరే అని గవర్నమెంట్ బుకాయిస్తున్నది.
“మళ్లీ ట్రాన్స్ ఫర్ చేశారు. ఒకటే పునరావృతం. నిన్ననే రాజ్యంగ దినోత్సవం జరుపుకున్నాం. అయినా, ఈ రోజు సుప్రీంకోర్టు ఉత్తర్వులను, నియమాలను ఉల్లంఘించారు. దీనితో కొందరికి సంతోషం కలగవచ్చు. నన్నేమో కొనాకి నెట్టేస్తున్నారు. నిజాయితీకి బహామానం అవమానమే,’ అని ఖేమ్కా ఒక ట్వీట్ లో హిందీలో పేర్కొన్నారు.
ఖేమ్కా  1991 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. సోనియా గాంధీ అల్లుడు అయిన రాబర్ట్ వాద్రాకి, స్కైలైట్ హాస్పిటాలిటీకి, డిఎల్ ఎఫ్ రియల్ ఎస్టేట్ కు  మధ్య జరిగిన ల్యాండ్ డీల్ మ్యుటేషన్ ను క్యాన్సిల్ చేసిన మొనగాడుగా ఆయన 2012లో వార్తలొకెక్కాడు. అంతే అప్పటినుంచి ఆయనకు కష్టాలు ఎక్కువే అయ్యాయి.
ఈ ఏడాది మార్చిలో ఖేమ్కా ను సైన్స్అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమించారు.అంతకు ముందు ఆయన స్పోర్ట్స్ శాఖలో ఉండేవారు. అక్కడ ఆయనను 15 నెలల పాటు ఉంచారు.గొప్పసంగతే. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మాత్రం ఆరు నెలల్లోనే పంపించేశారు.
ఈ మధ్యే అధికారంలోకి వచ్చిన బిజెపి-జననాయక్ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఈ బదిలీలు చేసింది.

ఖేమ్కా  అంటే ఏ ప్రభుత్వానికైనా వణుకు. ఎందుకంటే ఆయన అవినీతిని సహించడు. తనని ఏ డిపార్ట్ మెంటులో పోస్ట్ చేస్తే అక్కడి అవినీతిని వెలికి తీస్తాడు. బహాశా తాజాగా వచ్చిన బిజెపి సంకీర్ణ ప్రభుత్వం అర్కైవ్స్ లో , మ్యూజియం శాఖ లో అయితే, ఆయనేమీ చేయలేడని అక్కడికి బదిలీ చేసినట్లుంది.అయితే, ఖేమ్కా కాలుమోపాలే గాని అవినీతిని వాసన చూసిన పట్టగల సమర్థుడు. అక్కడెంత కాలం ఉంటాడో చూడాలి.
ఖేమ్కా పశ్చిమబెంగాల్ కలకత్తాలో పుట్టారు. 1988లో ఖరగ్ పూర్ ఐఐటి నుంచి కంప్యూటర్ సైన్స్ లో బిటెక్ డిగ్రీ తీసుకున్నారు. తర్వాత టిఐఎఫ్ ఆర్ లో పిహెచ్ డి చేశారు. ఆపైన ఎంబిఏ కూడా పూర్తి చేశారు. 1991లో సివిల్స్ సెలెక్టయ్యారు. ఆయనను హర్యానా కు కేటాయించారు.
ఇలా ఏడాది రెండు మూడు సార్లు బదిలీ చేసిన వేధిస్తున్నా, కేసులు పెడుతున్నా, చంపేస్తామని బెదిరిస్తున్నా ఖేమ్మా బెదరడం లేదు. ముఖ్యమంత్రికి సన్నిహితమయి మంచి శాఖ ల్లో పోస్టింగ్ వేయించుకుని, రూలింగ్ పార్టీకి, పార్టీనేతలకు సేవలందిస్తూ తామూ తరించేందుకు ఐఎఎస్ అధికారులు పోటీపడుతున్నఈరోజుల్లోఖేమ్మా లాంటి అధికారులున్నారంటే నమ్మలేం. ఈ మధ్య ఐఎఎస్ అధికారులు ఎలా తయారయ్యారంటే, చివరకు రిటైరయ్యాక కూడా పీస్ ఫుల్ గా ఇంటికివె ళ్లడం మానేశారు. రిటైరయ్యాక కూడా మా సేవలందించేందుకు రెడీ బోర్డు తగిలించుకుని కూర్చుుంటున్నారు.
అయితే, తనని ఇంతగా సతాయిస్తున్నా తాను ఉద్యోగం మాత్రం వదలి పారిపోయే బాపతుగాదని, ఈ వ్యవస్థలో ఇలాగే ఉంటూ పోరాడాతనని ఆయన చెబుతున్నారు.
2013 ఏప్రిల్ 43 వ సారి బదిలీ చేసినపుడు ఆయన ‘ నేను పారిపోయే వాణ్ని కాదు. నేను వ్యవస్థలో భాగం, వ్యవస్థలో కొనసాగుతా ( I am not quitter. I am part of this system and will stay in it. I am proud of it. I have only been doing my duty as an officer) ఆయన అన్నారు.
అవినీతి అక్రమాలలో హర్యానా కథే వేరు. ఆయారాం గయారాం కల్చర్ అను దేశానికి అందించిందే హర్యానా. అక్కడ ఏమయినా జరుగవచ్చు.

(Feature Photo from Facebook Timeline)