కొద్దిగా ఓపిక పట్టండి: లాక్ డౌన్ లో చిక్కుకున్నవారికి ఆంధ్ర ప్రదేశ్ విజ్ఞప్తి

ఇతర  రాష్ట్రాలలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు అదేవిధంగా ఆంధ్రలో  చిక్కుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన వారు మరికొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే :
వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కే. ఎస్. జవహార్ రెడ్డి ప్రకటన
ఏపీ గడ్డ మీద రకరకాల కారణాల వల్ల ఇతర రాష్ట్రాలకు లేక దేశాలకు వెళ్లిన వారు అందరూ మనవాళ్ళే అయితే వీరిలో కొంతమంది ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కొంతమంది తిరిగి స్వస్థలలకు వెళ్లాలి అనుకుంటున్నారు. మీరు అందరికీ నేను చేసే విజ్ఞప్తి …అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రావడం వల్ల మీరు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి లేదా ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి కరోన వ్యాధి ని సంక్రమింప చేసే అవకాశం ఉంటుంది అంతే కాకుండా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మీకు టెస్ట్ చేయవలసి ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. కే. ఎస్. జవహర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా మీరు పొరుగు రాష్ట్రాలకు వెళ్తే మళ్లీ మీకు టెస్టులు చేయాల్సిన అవసరం రావచ్చని ఒక పత్రికా ప్రకటన లో తెలిపారు.
మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏమనగా ఎవ్వరూ ప్రస్తుతానికి రాష్ట్రాలు దాటి బయటకు రావద్దని ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లి వద్దని మనవి అయితే వలస కూలీలు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని మాత్రం ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రంలోనికి ప్రవేశించడానికి అనుమతించడం జరిగింది, వీరిలో చాలామందికి ఆయా రాష్ట్రాలలో నివాసం లేదు అందరూ దాదాపు చాలా నిరుపేదలు .
లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న సోదరీ సోదరీమణులకు విజ్ఞప్తి ఏమిటంటే ఇప్పటి వరకు కరోనా పై జరుగుతున్న పోరులో విజయం సాధించే దిశగా మనం అడుగులు వేస్తున్నాం అయితే ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో వలస కార్మికులు పడుతున్న అవస్థలు గమనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వెసులుబాట్లు కల్పించాయి. ఈ వెసులుబాటు తమ స్వస్థలాలకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు మాత్రమే అని మనవి. ఇతరులెవరూ ప్రస్తుతానికి రాష్ట్రాలు దాటి ఆంధ్రప్రదేశ్ కి రావద్దు అని మనవి చేస్తున్నాం దీంతో మీ వల్ల ఇతరులకు ఇతరుల వల్ల మీకు కరోనా సంక్రమించే అవకాశం వుంటుంది.
ఇంటికి చేరాలనుకుంటున్న మీ సెంటిమెంట్ ను మేము అర్థం చేసుకోగలము అయితే మరికొంత సమయం మీ అందరి సహకారంతో ఈ వ్యాధి రాష్ట్రంలో చాలా వరకు కట్టడి చేయగలిగాము ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు అదేవిధంగా రాష్ట్రంలో వున్న వివిధ రాష్ట్రాలకు చెందిన వారు మరికొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే గా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ యుద్ధంలో మీ వంతు సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను.