నంద్యాల RARS భూముల బదలాయింపుపై హైకోర్టు స్టే

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (RARS) భూములను వైద్య కళాశాల కోసం బదలాయింపు చేయడానికి వ్యతిరేకంగా స్థానిక రైతుల తరుపున న్యాయవాది బొజ్జా అర్జున్ రెడ్డి గౌరవ హైకోర్టు లో 2020 వ సంవత్సరంలో కేసు వేశారు. హైకోర్టు యథాతథ పరిస్థితిని కొనసాగించాలని స్టే ఆర్డరు ఇచ్చారు.‌

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ను తంగడంచెలో ఏర్పాటు చేయడానికి జూన్ 7 వ తేదీన జీ.వో.నెంబరు 34 ద్వారా ప్రభుత్వం భూములను కేటాయించింది. ఈ ఉత్తర్వులో వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను బదలాయింపు కు అంగీకారం తెలిపినట్లు గా పేర్కొన్నారు.‌

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ను యథాతథ పరిస్థితిని కొనసాగించాలన్న హైకోర్టు ఇచ్చిన స్టే కు ఈ చర్యలు వ్యతిరేకంగా ఉన్నాయి.

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ను యదాతద స్థితిలో కొనసాగించాలని  హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డరు ను ప్రభుత్వానికి గుర్తు చేస్తూ న్యాయవాది ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి పూనం మాలకొండయ్యకు నోటీసు పంపారు.

న్యాయవాది బొజ్జా అర్జున్ రెడ్డి

ఈ స్టే ఆర్డరు ను గౌరవిస్తూ వ్యవసాయ పరిశోధనా స్థానం ను తంగడంచెలో ఏర్పాటు చేయడానికి భూములను కేటాయిస్తూ ఇచ్చిన జీ.వో.నెంబరు 34 ను రద్దు చేయాలని న్యాయవాది బొజ్జా అర్జున్ రెడ్డి ఈ నోటీసు లో పేర్కొన్నారు .

హైకోర్టు స్టే ఆర్డరు ననుసరించి నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నిర్వహణ యథాతథ స్థితిలో కొనసాగించాలని నోటీస్ లో పేర్కొన్నారు.‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, కర్నూలు జిల్లా కలెక్టరు, ANGRAU రిజిస్ట్రార్, RARS A.D.R, నంద్యాల తహశీల్దారు వారికి కూడా ఈ ఈ నోటీసు నకలు సమాచారం నిమిత్తం పంపడమైనది.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/english/trending/pil-filed-in-high-court-against-taking-rars-lands-for-medical-college/

 

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/breaking/nandyala-lawayer-bojja-arjun-name-figures-in-alb-50-advocates-2/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *