Home Breaking మూడు రాజధానులకు క్యాబినెట్ ఒకె: ఇవే ఆంధ్రా క్యాబినెట్ నిర్ణయాలు

మూడు రాజధానులకు క్యాబినెట్ ఒకె: ఇవే ఆంధ్రా క్యాబినెట్ నిర్ణయాలు

96
0
రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చాలనకుంటున్న  ఏపీ  ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. రాజధాని మార్పు మీద అనేకనిర్ణయాలు తీసుకుంది. సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షత వహించారు. మూడు రాజధానులకు క్యాబినెట్ అమోదం తెలిపింది. అవి  ఇపుడు  అసెంబ్లీ ముందుకు రానున్నాయి. ఇవే నిర్ణయాలు :
హైపవర్ కమిటీ నివేదికలకు కేబినెట్ ఆమోదం
విశాఖకు సచివాలయం హెచ్ఓడి కార్యాలయాలు తరలింపు.
అమరావతి లోనే మూడు అసెంబ్లీ సెషన్స్
కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ భూములు ఇచ్చిన రైతులకి కవులు 10 నుంచి 15 ఏళ్లకు పెంపు
సీఆర్డీఏ రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
ఏఎంఆర్డిఏ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్లు 2500 నుంచి 5 వేలకు పెంపు