కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా పాజిటివ్

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా సోకింది. తాను కరోనా పాజిటివ్ అని తేలినట్లు అమిత్ షా ట్వీట్ చేశారు. అయోధ్య ఆలయం శంకుస్థాపనకు కేంద్ర సమాయత్తమవుతున్నపుడు ఆయన ఇలా కరోనా పాజిటివ్ అయ్యారు. అంటే శంకస్థాపన చారిత్రక ఘట్టం తిలకించేందుకు ఆయన అయోధ్య వెళ్లకపోవచ్చని అనుకుంటున్నారు.‘ నేను కరోనా పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్ అయ్యాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. వైద్యుల సలహా మేరకు నన్ను ఆసుపత్రిలో చేర్పించారు.గత కొద్ది రోజులుగా నాతో సంప్రదించిన వారంతా కరోనా టెస్టులు చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాను,’ అని అమిత్ షా పేర్కొన్నారు.

 

 

 

कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है परन्तु डॉक्टर्स की सलाह पर अस्पताल में भर्ती हो रहा हूँ। मेरा अनुरोध है कि आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।

— Amit Shah (@AmitShah) August 2, 2020

కరోనాతో ఆసుపత్రిలో చేరిన అమిత్ షా తొందరగా కోలుకోవాలని రాజ్యసభ బిజెపి ఎంపి డాక్టర్ సుబ్రమణియన్ స్వామి ఆకాంక్షించారు.

I am sorry to hear from news media that Amit Shah has to be admitted to hospital because he has tested positive for Coronavirus. I wish him speedy recovery and pray for his early discharge

— Subramanian Swamy (@Swamy39) August 2, 2020