బోనాల కోసం అక్కన్నమాదన్న మహంకాళి గుడి హైకోర్ట్ లో పిటిషన్

తరతరాలుగా వస్తున్న సాంప్రదాయానికి అనుగుణముగా భక్తుల మత పరమైన మనోభావాలను, విశ్వాసాలను గౌరవిస్తూ ఈ నెల 20 వ తేదీ బోనాల ఘటాల వూరేగింపును అనుమతించాని హైదరాాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది.
కరోనా నియమాల ప్రకారం పూరీజగన్నాధుడని రథయాత్రను సుప్రీంకోర్టు అనుమతించడం హైదరాబాద్ బోనాల నిర్వాహకులు కూడా ఇదే విధంగా తమని అనుమతించాలను కోరుతున్నారు.
జూలై 20 సోమవారము నాడు పది మంది భక్తులతో ఏనుగు అంబారీ పై అమ్మవారి ఘటానికి వీడ్కోలు పలికే అనుమతి నివ్వాలని వారు కోర్టు ను కోరారు. ఈమేరకు ఏనిమిదో తేదీన పిటిషన్ దాఖలయింది.
పాతబస్తీ,హరిబౌలి,శాలిబండా లోని చారిత్రాత్మకమైన శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరము నిర్వాహకులు ప్యాట్రాన్ జి నిరంజన్ నేతృత్వంలో కోర్టును ఆశ్రయించారు.
సోమవారము, 13 వ తేదీన పిటిషణ్ విచారణకు వచ్చే అవకాశముంది.
కరొనా సాకుతో ఎవరితో సంప్రదించకుండా బోనాల ఘటాల ఊరేగింపును రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిందని వారు పిటిషన్ లో పేర్కొన్నారు.
కరొనా లాంటి అంటువ్యాదుల నుండి తమను రక్షించమనే అమ్మవారిని ప్రార్థిస్థూ ప్రజలు బోనాల పండుగ జరుపుకుంటారని , సాంప్రదాయాలనకు, ఆచారాలకు విఘాతము కల్పించడము క్షేమకరము కాదని వారు పిటిషన్  లో పేర్కొన్నారు.