థామస్ కుక్ దివాళా, హోటళ్లలో బందీలుగా 6 లక్షల మంది పర్యాటకులు

ప్రపంచ పర్యాటక రంగంలో ఒక వెలుగు వెలిగి, 178 సంవత్సరాల చరిత్ర ఉన్న అంతర్జాతీయ టూర్ ఆపరేటర్ ‘థామస్ కుక్’ కంపెనీ దివాళా తీసింది.యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటపడాలనుకోవడం, గ్లోబల్ వార్మింగ్, ఇంధన ధరలుపెగడంతో, నిర్వహణ  అప్పుల భారం పెరిగి పోవడంతో  కంపెనీని రాత్రిరాత్రి ఉన్నఫలాన  మూసేయాల్సి వచ్చింది.
ఆదివారం రాత్రి ఈ కంపెని లిక్విడేషన్ కు నిర్ణయమయింది. దీనితో ఈ కంపెనీ నడుపుతున్న టూర్లలో ప్రపంచంలోని అనేక దేశాలలో ఉన్న పర్యాటలకు అక్కడి హోటళ్లలో చిక్కుకు పోయారు.
ప్రపంచ పర్యాటక రంగంలో ఇంత టి సంక్షోభం ఎపుడూ రాలేదు.
కంపెనీని కట్టించేందుకు షేర్ హోల్డర్స్ తో నిన్న రాత్రి జరిగిన సమావేశంలో విఫలం కావడంతో లండన్ నుంచి మొదలయ్యే ధామస్ కుక్ విమాన సర్వీసులన్నీ రద్దు చేశారు. దాదాపు పది లక్షల బుకింగ్లను కూడా రద్దు చేశారు. కంపెనీ దివాళా తీయడంతో థామస్ కుక్ లో పని చేస్తున్న 21 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వీరిలో యుకె లో పని చేస్తున్నవారే 9 వేల మంది దాకా ఉన్నారు.
వారంతా ఎలా ఇంటి దారి పట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. వీరిని ఆయా దేశాలకుపంపించే బృహత్తర కార్యక్రమాన్ని బ్రిటన్ భూజానేసుకోవలసిన పరిస్థితి వచ్చింది.
సిఎన్ ఎన్ రిపోర్టు ప్రకారం దాదాపు  ఆరు లక్షల  మంది పర్యాటకులు ధామస్ కుక్ యాత్రల్లో ఉన్నారు. అయితే, వీళ్లంతా తమ పర్యటన ఖర్చులను థామస్ కుక్ కుఎపుడో చెల్లించారు. అయితే, ఇపుడు ఆ కంపెనీలేదు. హోటళ్లకు బిల్లులు ఎవరు చెల్లించాలి. లెక్క ప్రకారం, వీళ్లందరికి రూమ్ లను బుక్ చేసింది ధామస్ కుక్ కంపెనీయే కాబట్టి బిల్లు చెల్లించాల్సింది కూడా కంపెనీయే. కంపెనీ దివాళా తీసింది కాబట్టి బిల్లుమీరే కట్టాలని చాలాదేశాల్లో హోటల్ యాజమాన్యాలను థామస్ కుక్ క్లయింట్లను నిర్బంధించినట్లు వార్తొలొస్తున్నాయ్.
ట్యూనిసియా రాజధాని ట్యూనిస్ లో ని ఒక హోటల్ లో ఈ యాత్రికులంతాబందీలయిపోయారు. ట్యునిస్ సమీపంలోని హమ్మామెత్ పట్టణంలోని లే అరేంజెర్స్ (Les Orangers) బీచ్ రెస్టార్ట్ల్ లు పర్యాటలకు ఎవరూ తప్పించుకునిపోకుండా గేట్లు మూసేశారు.
థామస్ కుక్ కంపెనీ ఇక్కడ బుక్ చేసిన రూమ్ లకు పూర్తి మొత్తం చెల్లించలేదు. మిగతా మొత్తం కంపెనీ చెల్లించే అవకాశం లేకపోవడంతో అతిధులనే కట్టాలని హోటల్ వత్తిడి తెస్తూ ఉంది. కట్టే దాకా ఎవరినీ బయటకు పంపేది లేదని, హోటల్ గేట్లను మూసేశారు. వాళ్లకు కాపలా పెట్టారు.
శనివారం నాడు హోటల్ యాజమాన్యం థామస్ కుక్ పర్యాటకులందరిని సమావేశపరిచ్చి కంపెనీ తమకు బకాయి ఉన్న మొత్తాన్ని కట్టాలని చెప్పింది. అయితే, తాము మొత్తం బిల్లు థామస్ కుక్ కు కట్టేశామని, ఇక కట్టేది లేదని పర్యాటకులు తెగేసి చెప్పారు. దీనితో వివాదం మొదలయింది. తర్వాత  హోటల్ని మూసేశారు. థామస్ కుక్ పర్యాటకులెవరూ బయటకు పోకుండా వాళ్లందరిని బందీలు చేశారు.
హాలిడే ఖర్చుకంటే ఎక్కవగా తమనించి హోటల్ వాళ్లు డిమాండ్ చేస్తున్నారని, తనని 1800 పౌండ్లు కట్టాలని అడిగారని ఒక మహిళ చెప్పారు. పర్యాకుల్లో చాలా మంది హనీ మూన్ కు వచ్చారు. వాళ్ల ఆనందం గాల్లో కలసిపోయింది. కొందరు పెళ్లిచేసుకునేందుకు సూదూరంగా ఉన్న రిసార్ట్స్ కు వచ్చారు. వాళ్ల కలలు భగ్నమయ్యాయి.
థామస్ కుక్ అనేది అల్లాటప్ప కంపెనీ కాదు. 178 సంవత్సరాల గొప్ప ట్రావెల్ చరిత్ర ఉన్న కంపెనీ. అయినా దివాళా తీసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సుమారు 6 లక్షల మంది పర్యాటకులు థామస్ కుక్ పర్యటనల్లో వివిధ దేశాల్లో ఉన్నారు.
ప్రపంచంలోని 60 ప్రదేశాలకు థామస్ కుక్ పర్యటలను ఆర్గనైజ్ చేస్తూ ఉంది. అయితే, యుకె నుంచి మొదలయిన పర్యటనలకు సంబంధించి వివిధ దేశాల్లో చిక్కుకు పోయినా 1,60,000 మందిని లండన్ కు తీసుకువచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. అక్కడి నుంచి ఈ పర్యాటకులను వారి వారి దేశాలకు తీసుకువేళ్లే బాధ్యత వాళ్ల ప్రభుత్వాలదేనని బ్రిటన్ చెబుతూ ఉంది.
థామస్ కుక్ కు కష్టాలు ఎందుకొచ్చాయ్
థామస్ కుక్ కంపెనీ 1841లో ఇంగ్లండులో ఒక్క రోజు ట్రెయిన్ ఎక్స్ కర్షన్ ప్రోగ్రామ్స్ ఏర్పాట్లు చేస్తూ మొదలయింది. ిపుడు 16 దేశాలలకు కంపెనీ కార్యకలాపాలు విస్తరించాయి. అయితే, ఈ మధ్య కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి. యూరోప్ బ్రిక్సిట్ సంకోభం ఒక కారణమంటున్నారు. కష్టాలనుంచి బయటపడేందుకు 200 మిలియన్ పౌండ్ల ఆర్థిక సాయం కోరుతూ నిన్న రాత్రి షేర్ హోల్డర్లతో సమావేశం జరిపారు. ఈ మధ్యనే చైనా కంపెనీ ఫోషన్ నుంచి 900 మిలియన్ పౌండ్లను కూడా సేకరించింది. అయినా కష్టాలు తీరలేదు. ఈ ఏడాది మేలో కంపెనీ 1.25 బిలియన్ పౌండ్లు రుణాలు చూపించింది. బ్రిక్సిట్ రాజకీయాలతో పాటు, యూరోప్ లో వాతావారణం వేడెక్కడంతో ప్రజాలు చల్లటి ప్రదేశాలను సందర్శించడం మానుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. దీనితో బుకింగ్ లు తగ్గిపోయాయి. దీనికి తోడు ఇంధనం ధరలు పెరగడం, హోటల్ బుకింగ్ ధరల భారం కలసి థామస్ కుక్ ను కష్టాల వూబిలోకి నెట్టాయి.