ఎయిర్ ఏషియా కేసులో చంద్రబాబు నాయుడిని సిబిఐ ప్రశ్నిస్తుందా?

చంద్రబాబు నాయుడిని పట్టుకంటే ఏ పనయినా పూర్తవుతుంది, అది కూడ అడ్డదారిలో. ఇది అంతర్జాతీయంగా కూడా తెలిసిపోయింది ఎయిర్ ఎషియా కంపెనీకి ఇండియా అంతర్జాతీయ రూట్లు కావాలి. సాధారణంగా రూల్ ప్రకారం వెళితే, బాగా లేట్ అవుతుంది. తొందరగా పని జరగాలి. ఏం చేసయినా సరే అంతర్జాతీయ రూట్లకు పర్మిషన్ తెచ్చుకోవాలి. ఎంత ఖర్చరయిన పర్వాలేదు. ముందు పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇది ఎయిర్ ఏషియా నిర్ణయం.

ఏదారయినా తొక్కమని మలేషియా నుంచి పనిచేసే ఎయిర్ ఏషియా కంపెనీ సిఇవొ టోనీ ఫెర్నాండెజ్ ఇండియాలోని తమ సిబ్బందిని ఆదేశించారు.ఈ పని ఎలా సాధ్యమవుతుందో బ్రోకరపనులు రాజిందర్ దూబే సమక్ష్యం ఎయిర్ ఏషియా ఇండియా మాజీ  సిఇవొ మిట్టు చాండిల్య ఒకప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ కు సంబంధించిన ఆడియోటేపులు ఇపుడు బయటకొచ్చాయి. ఇవి తనదగ్గిర ఉన్నాయని బిజినెస్ టుడే మ్యాగజైన్  ప్రకటించింది.

ఈటేపుల్లో ఉన్న ఆసక్తి కరమయిన విషయాల్లో పౌరవిమానశాఖ మాజీ మంత్రి ఆశోక్ గజపతి రాజు పేరుతో పాటు ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు పేరు కూడా దొర్లింది. మామూలుగా కాదు, ఏ దారయినా తొక్కి పనిపూర్తి చేసుకురుమ్మని  టోని ఫెర్నాండెజ్ చెప్పిన అడ్డదారి గురించిన ప్రస్తావనలో.

అంతర్జాతీయ రూట్లకు పర్మిషన్ కావాలంటే, అనుమతించాల్సింది అశోక్ గజపతి రాజు. ఆయన సిఫార్స్ చేయగల ఒకే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మిట్లు చాండిల్య చెప్పాడు. అంతేకాదు, వారు తనకు బాగా తెలుసని, తాము అనుకుంటున్న అడ్డదారి అదే నని చెప్పారు.  ఈ సంభాషణ మొత్తం 33 నిమిషాలు సాగింది. అంతేకాదు, మీరు పోయి చర్చలు జరపండి. తాను మాత్రం తలదూర్చనని కూడా ఫెర్నాండెజ్ చెప్పారు.

Tony Fernandes (L) with Mitu Chandilya during a press conference in 2013 (Business Today Photo)

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిఅని, ఆయనకు ప్రధాని పదవికి చాలా అర్హుడని, గతంలో అశోక్ గజపతిరాజు ఆయనదగ్గిర ఆర్థిక మంత్రిగా పనిచేశాడని కూడా చాండిల్య చెప్పాడు. ఇలాంటి చంద్రబాబు నాయుడిని తమ వైపు ఉంచుకోవడం చాలా అవసరమని కూడా మిట్టు చెప్పారు. ఆయన చెప్పినది టేప్ లో ఇలా రికార్డయింది. అంతేకాదు, ఈ పని చేసేందుకు అభ్యంతరం లేదని, అయితే, తనవ్యక్తిగా తాను చాండిల్యను కలవదలుచుకోలేదని అశోక్ గజపతి రాజు అన్నారు. దీనర్థం ఏమిటి; ఇతగాడు  నమ్మదగ్గ వ్యక్తి కాదని ఆయన వూహించారు. ఆయన పొరపాటు ఒక ఫోటో దిగనా ముందు ముందు కొంపలంటుకుంటాయని  అశోక్ గజపతిరాజుకు తెలిసే ఇలా హెచ్చరిక చేశారా?

In the tape, Chadilya talks about his closeness to the then aviation minister A. Gajapathi Raju. Chandilya tells Fernandes that N. Chandrababu Naidu was potentially the prime minister candidate, but he is now the chief minister of Andhra Pradesh.

“His finance minister is now the civil aviation minister. If you play nice with Chandrababu Naidu, we will get everything. The civil aviation minister told me. They want to build Vizag into aviation centre. They are willing to give zero tax on ATF [aviation turbine fuel] as long as we put a hub there. The minister told me that he doesn’t want to be seen physically with me that much, but you tell me what you want. This guy is like [Narendra] Modi. It’s good to have him on our side,” Chandilya tells Fernandes.

ఎయిర్ ఏషియా  మీద సిబిఐ విచారణ జరుగుతూ ఉంది. ఈ కంపెనీ గ్రూప్ సిఇవొ టోనీ ఫెర్నాండెజ్ జూన్ ఆరో తేదీన సిబిఐ ముందు హాజరవుతున్నారు. ఎయిర్ ఏషియా ఇండియా కంపెనీకి అంతర్జాతీయ పర్మిషన్ల కోసం పౌరవిమాన శాఖలో సీనియర్ అధికార్లకు పెద్ద ఎత్తున లంచం తినిపించారన్నది ఆరోపణ. దీనిమీద ఇపుడు సిబిఐ విచారణ జరుగుతుూ ఉంది. ఇప్పటికే రాజేంద్ర దూబేని సిబిఐ ప్రశ్నించింది.

రూల్ ప్రకారం  ఇంటర్నేషనల్ రూట్ల కనీసం 20 సర్వీసులు నడిపుతున్నపుడు, కనీసం 5 సంవత్సరాలు ఇలా నడిపిన విమాన సంస్థలకు అంతమాత్రమే భారతదేశం అంతర్జాతీయ సర్వీసులకు అనుమతి నిస్తుంది. దీనినే 5/20రూల్  అంటారు. ఈ రూల్ ను సవరించేందుకు ఈ సంస్థ భారీగా లంచం ఇచ్చిందనే ఆరోపణ మీద సిబిఐ విచారణ చేస్తూ ఉంది.

ఈ లంచం తీసుకున్న సివిల్ ఏవియేషన్ సీనియర్ అధికారులు ఎవరు?

ముడుపులు ఎవరికి ముట్టాయి అనేది తేలాల్సి ఉంది.

ఇందులో చంద్రబాబు నాయుడి ప్రమేయం, అశోక్ గజపతి రాజు పాత్ర ఎంతవుందో  చెప్పడం కష్టం. అయితే, ఏదారయినా తొక్కి ఎయిర్ ఏషియా ఇండియా కు అంతర్జాతీయ సర్వీసుల పర్మిషన్ తీసుకురమ్నన్నపుడు చంద్ర బాబు నాయుడి పేరు వినిపించడం వల్ల అనుమానాలొస్తున్నాయి.చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ సెటిల్ మెంట్లు చేస్తున్నారా? లేక పోతే, నిప్పు లాంటి చంద్రబాబు నాయుడి పేరు అడ్డదారులు తొక్కాలనుకున్నపుడు ప్రస్తావనకు రావడమేమిటి?

కేంద్రం తన మీద కక్ష తీర్చుకునేందుకు కేసులు పెట్టేలా ఉందని చంద్ర బాబు చాలా కాలంగా భయపడుతూ వస్తున్నారు. పబ్లిక్  మీటింగ్ లలో కూడా చెబుతూ వస్తున్నారు. భయం  ఆయన ముఖం మీద స్పఫ్టంగా కనిపిస్తుంది. దీనికి కారణం, ఇదేనా…

తొందర్లో నిప్పు లాంటి చంద్ర బాబు నాయుడిని సిబిఐ ప్రశ్నిస్తుందా; అవినీతికి ఆమడదూరం ఉండే అశోఖ గజపతిరాజు ను కూడా సిబిఐ విచారణకు రమ్మంటుందా?

ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తుఫాను తప్పదు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *