ఆర్టీసి సమ్మెమీద ప్రభుత్వం నివెేదిక : హైకోర్టు అసంతృప్తి

తెలంగాణ ఆర్టీసి సమ్మె వల్ల ప్రయాణికులకు ఇబ్బుందులు లేకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల  మీద  ప్రభుత్వం సమర్పించిన నివేదిక మీద హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని కోర్టు వాదించింది.అయితే, ప్రభుత్వం నివేదిక అస్పష్టంగా ఉందనిచెబుతూ కేసును ఈ నెల 15కు వాయిదా వేసింది. సమ్మె మీద వేసిన పలు పిటిషన్లనుకోర్టు విచారణకు స్వీకరించింది.
ఆర్టీసి JAC తరుపున న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు.
‘తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అని కార్మికులు సమ్మె బాట పట్టారు. 30 రోజుల ముందే సమస్యలు పరిష్కరించాలి అని ప్రభుత్వం ను కోరారు. 3,24,26 తేదీల్లో ఆర్.టి సి కి ప్రభుత్వం కి నోటీసులు ఇచ్చారు. తమ డిమాండ్లు పరిష్కరించలేదనే సమ్మె కు వెళ్ళారు. కార్పొరేషన్ ఫండ్స్ 545 కోట్లు తో పాటు ప్రభుత్వ రాయితీ సొమ్ము చెలించాలి.అన్ని పొలిటికల్ పార్టీలు సమ్మె కు మద్దతు ఇచ్చారు.’
ప్రభుత్వం తరపున వాదనలు అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావు వినిపించారు
ఆర్.టి.సి కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే. ఆర్టీసి  కార్మికుల సమస్య ను పరిష్కరించేందుకు గత నెల 29 న కమిటీ నియమించింది. కార్మికుల డిమాండ్ పరిష్కరించే లోపే సమ్మె బాట పట్టారు. సమ్మె కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చేశాం.
పివి కృష్ణయ్య న్యాయవాది  ప్రయాణికుల ఇక్కట్లను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
‘‘సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె విరమింపజేసి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరాం.అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం ఇద్దరి మధ్య ప్రజలు నలిగిపోతున్నారు.ఇద్దరూ ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు.సమస్య పరిష్కారానికి ఇద్దరూ ఒక్క తాటిపైకి రావట్లేదు.ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడానికి ప్రభుత్వం ఒప్పుకోవటం లేదు.కార్మికుల డిమాండ్లు సాధించే వరకు ససేమిరా ఉద్యోగాల్లో చేరమంటున్నారు.’’
కేసు వాయిదా
ఈ రోజు ప్రభుత్వం సమర్పించిన రిపోర్ట్ తో సంతృప్తి చెందని కోర్టు ఈ నెల 15 వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని కార్మిక సంఘాలకు, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.