Home Breaking జగన్, కెసిఆర్ ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: చంద్రబాబు నిప్పులు

జగన్, కెసిఆర్ ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: చంద్రబాబు నిప్పులు

196
0
SHARE
 టిడిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ముఖ్యమంత్రి  జగన్  మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కొద్ది సేపటి కిందట వియవాడలో విలేకరులతో మాట్లాడుతూ కెసిఆర్ కు జగన్ కు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బు తీసుకుని కెసిఆర్ కు గోదావరి నీళ్లిస్తున్నాడు. ఇవి చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ హైలెట్స్:

1

ఈరోజు కూడా అసెంబ్లీలో  సిఎం జగన్ తో పాటు  మంత్రుల ప్రవర్తన దారుణంగా ఉంది. అసెంబ్లీ హుందా తనాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. తొలిరోజు టిడిపి కార్యకర్తలు పై దాడికి సంబంధించి చర్చకు అడిగాం. నేడు 13వ రోజు. ఇంత వరకు మాకు అవకాశం ఇవ్వలేదు.అధికార పక్ష సభ్యలు తిడుతున్నా మమ్మలను సమాధానం చెప్పనివ్వడం లేదు.

2

నీరు చెట్టు కు సంబంధించిన ఎపి లో ఆదర్శంగా కార్యక్రమం నిర్వహించాం.దేశంలోనే చరిత్ర సృష్టిస్తే… దానిలో కూడా అవినీతి జరిగిందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు

3

22వేల కోట్లతో అనేక పనులు పూర్తి చేసి .. దేశంలోనే ఆదర్శంగా నిలిచాం.అసెంబ్లీ అంటే మంచి కార్యక్రమాలకు వేదిక కావాలి, ప్రజల సమస్యల పై చర్చించాలి. కానీ నోరు పారేసుకుసుకుని  అవాకులు, చవాకులు పేలుతున్నారు. గతంలోనే ఆరోపణలు చేస్తే..‌ కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చింది. వంశధార విషయం పైనా రాజకీయం చేస్తున్నారు

4.

మీరు జల యజ్ఞంను.. ధన యజ్ఞం గా మార్చారు.తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విక్ ప్రోకో పాల్పడిన వ్యక్తి జగన్. ఇప్పుడు సత్యవంతుడిలా మాకు నీతులు వల్లిస్తున్నాడు. (నీటి పంపిణీ, ప్రాజెక్టులకు సంబంధించి కర్నూలులో నాడు జగన్ మాట్లాడిన వీడియో ను మీడియాకు చూపించారు).

5

అప్పుడు కేసిఆర్ ను తిట్టిన జగన్ఇ ప్పడు కేసిఆర్ ను పొగుడుతున్నాడు. (మరో వీడియో ను ప్రదర్శించారు.) నీటి వాటాలు, ప్రాజెక్టు ల విషయంలో జగన్ మాట మారుస్తూ ప్రజలను ఏమారుస్తున్నారు. జగన్  తన స్వార్దం కోసం ఎపి ప్రజల ప్రయోజనాలను తెలంగాణా కు తాకట్టు పెడుతున్నారు.

 

కేసిఆర్, జగన్ ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు అర్థమవుతూ ఉంది.

6

ఎన్నికల సమయంలో అటు నుంచి ఇటు డబ్బులు వచ్చాయనేది చిన్న పిల్లలు కూడా చెబుతున్నారు.క్విడ్ ప్రోకో ద్వారా డబ్బు తీసుకున్నందుకు.. మన నీరు వాళ్లకు ఇస్తున్నారు. ఎవరి వాటా ప్రకారం వాళ్లు నీళ్లు. వాడుకుందామని మా‌ కేశవ్ అంటే.. ఇష్టానుసారం గా మాట్లాడుతున్నారు

7

ముఖ్యమంత్రి నోరు అదుపులో పెట్టుకోవాలి.. మేము కూడా మాట్లాడగలం. హుందాతనం గా ఉండాలి.. చిల్లర తనం మానుకోవాలి. ఎంతో మంది సిఎం లను నేను‌ చూశా.. ఇంత నీచంగా ఎవరూ ప్రవర్తించ లేదు

8

వయసులో కుర్రాడు… నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా.మాకు నిరసన తెలియ చేసే అవకాశం కూడా ఇవ్వరా.ప్రశ్నిస్తే… నలుగురు ఎమ్మెల్యే లను ఈరోజు సస్పెండ్ చేశారు.బయటకు పంపిస్తే.. భయపడేది లేదు.. స్పీకర్ కూడా తన తీరు మార్చుకోవాలి.పులివెందుల ‌పంచాయతీ ని అమలు చేయాలని జగన్ చూస్తున్నాడు.. స్పీకర్ సహకరిస్తున్నాడు

9

తెలంగాణ కు నీరు ఇవ్వనక్కర్లేదు.. మన నీళ్లను రాయలసీమ కు ఇవ్వాలి.మన నీళ్లు మనం, వారి నీళ్లు వారు వాడుకునేలా చూడాలి. ఇది జగన్ సొంత విషయం కాదు.. ఎపి ప్రజల హక్కు.మనం‌ వాడగా .. మిగిలిన నీరు మాత్రమే తెలంగాణ కు ఇస్తే బాగుంటుంది.రేపు కేసిఆర్, జగన్ పర్మినెంట్ కాదు.. ఎపి, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే పర్మినెంట్.డబ్బులు ఇచ్చారు కదా అని.. నీళ్లిస్తామంటే రైతులు చూస్తూ కూర్చోరు.

10

ప్రజావేదిక కట్టడానికి ఎనిమిది నెలలు పట్టింది.. కూల్చడానికి నాలుగు గంటలు తీసుకున్నారు.ప్రజా ధనం తో నిర్మించిన భవనాలు కూలగొడితే ఎవరికి నష్టం.పోలవరం, అమరావతి లకు ఉన్న బ్రాండ్ ను చెరిపేశారు.మన రాజధాని కోసం 33వేల ఎకరాలు రైతులు ఇస్తే.. వారి నమ్మకాన్ని నీరుగార్చారు

11

వైయస్ హయాంలో జరిగిన అక్రమాలను ఎందుకు లేవనెత్తరు.పిపియల్ విషయంలో నాలుగు అంశాల పై నేను మాట్లాడితే సిఎం స్పందించలేదు. 22వేల కోట్లు నగేరా డబ్బు ను నీరు చెట్టుకు మేం వాడాం. వాస్తవాలు చెప్పకుండా… అవాస్తవాలతో మా పై బురద జల్లడమే పనిగా సిఎం జగన్‌ మాట్లాడుతున్నారు.మేము ఇరిగేషన్ లో యాభై వేల కోట్ల పని చేస్తే..‌55వేల కోట్ల అవినీతి అంటారు.

12

తితిలీ తుఫాన్ లో బాగా మేం పని చేస్తే.. పక్కనే ఉన్నా కూడా రాని జగన్ .. ఇప్పుడు అవినీతి అని మాట్లాడుతున్నాడు.కనీస పరిజ్ఞానం లేకుండా.. మా పాలన అంతా అవినీతి మయంగా చిత్రీకరించేందుకు జగన్ తాపత్రయ పడుతున్నాడు. అతి ముఖ్యమైన విషయంలో కూడా మాకు మైక్ ఇవ్వకపొవడం వల్లే మేము బాయ్ కాట్ చేశాం

13

గతంలో నేను చేసిన అభివృద్ధి పనులను వైయస్ కొనసాగించాడు.జగన్ మాత్రం కుట్ర, కుతంత్రంతో పనులన్నీ నిలిపివేశాడు.రాజధానిలో రోడ్లు నిర్మాణం చేపట్టినా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది.కామన్ సెన్స్ లేకుండా… జగన్ మూర్ఖంగా ముందుకు వెళుతున్నాడు.జగన్ పెద్ద నీతి వంతుడులా రోజూ మాట్లాడుతున్నాడు.. ప్రతి శుక్రవారం ఎక్కడకి పోతున్నాడు.

గవర్నర్ ను ఈరోజు మర్యాద పూర్వకంగా కలిశాం.నేను నిర్మించిన భవనమే ఇప్పుడు రాజ భవన్ గా మార్చారు.మీడియా పై కూడా పులివెందుల పంచాయతీ.. చూపిస్తున్నారు.లోపాలను ఎత్తి చూపితే.. బహిష్కరణ వేటు వేస్తున్నారు.

14

ఇసుక విధానంలో దోచుకోక పోతే ఎందుకు రేట్లు పెరిగాయి.పాలన బాగుంటే… రైతులు ఎందుకు ఆత్మహత్య లు‌ చేసుకుంటున్నారు.రెండు నెలల్లోనే ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వం ఎప్పుడూ లేదు.ఇష్టానుసారంగా వ్యవహరించే ముఖ్యమంత్రి ని కూడా ఎక్కడా చూడలేదు.ప్రజా ఉద్యమాలు , ఆందోళనలు ఎదుర్కోక తప్పదు