ఆంధ్రలో ఏంచేయొచ్చు, ఏంచేయరాదు: కోవిడ్ నోడల్ అధికారి వివరణ

(డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ ,స్టేట్ నోడల్ అధికారి కోవిద్ 19)
లాక్ డౌన్  31-05-2020 వరకు పొడిగించాక ఆంధ్రలో అమలు అయ్యే  జాతీయ నియమావళి
నిషేధించబడినవి 
*అన్నీ దేశీయ మరియు అంతర్జాతీయ విమాన సర్విస్ లను నిషేధించబడినవి.
*అన్నీ మెట్రో సర్వీసులు సైతం నిషేధించబడ్డాయి.
పాఠశాలలు, కళాశాలలు, విద్య మరియు శిక్షణ సంస్థలు మూసి వేయబడతాయి.
*ఆన్ లైన్ ద్వారా నిర్వహించబడే క్లాస్ లకు మరియు దూర విద్య కు ఎటువంటి ఆంక్షలు ఉండవు.
*హోటల్లు, రెస్టారెంట్లు మరియు అతిథి సేవలను నిషేధిస్తారు.
*కోవిడ్ పోరాటం లో నిమగ్నమైన హెల్త్ వర్కర్లు, పోలీసు సిబ్బందికి, ప్రభుత్వ అధికారులకు, ఒంటరి వ్యక్తులకు , టూరిస్టులకు, క్వారంటైన్ సౌకర్యం కు సంబంధించి సేవలు అందించే హోటల్‌కు అనుమతి ఉంటుంది.
*బస్సు డిపోలా వద్ద రైల్వే స్టేషన్ మరియు ఎయిర్‌పోర్టు వద్ద అనుమతిస్తారు.
* కిచెన్ ద్వారా వండిన పదార్ధాలు డోర్ డెలివరీకి అనుమతి ఉంటుంది.
సినిమా ధియేటర్లు, షాపింగ్ మాల్స్, జిమ్ లు, స్విమ్మింగ్ ఫూల్స్ , ఎంటర్టైన్మెంట్ పార్కులు ధియేటర్లు, ఆడిటోరియమ్ లు, అసెంబ్లీ హాల్స్ వంటి ప్రదేశాలు మూసి వేయబడతాయి.
*స్పోర్ట్ కాంప్లెక్సులు, స్టేడియం లు అనుమతించబడతాయి కానీ సందర్శకులను అనుమతించబడరు.
*పెద్ద సంఖ్యలో ప్రజలు చేరు అన్నిరకాల సామాజిక /రాజకీయ /క్రీడలు /వినోదం /విద్య /సాంస్కృతిక /మతపరమైన/ లేదా ఇతర సందర్భాల్లో జరిపే కార్యక్రమాలకు నిషేధం ఉంటుంది.
*అన్నీ మతపరమైన ప్రదేశాలు, ప్రార్ధనా స్థలాలు మూసి వేయబడతాయి. మరియు మతపరమైన కార్యక్రమాలు లో ఖచ్చితమైన నిషేధం ఉంటుంది.
*కంటైన్మెంట్ జోన్ మినహా మిగతా ప్రాంతాలలో కొద్దిపాటి ఆంక్షల ద్వారా అనుమతించే కార్యక్రమాలు.
*పరస్పర అవగాహనతో రాష్ట్రాల మద్య నడిపే ప్రయాణికుల వాహనాలు మరియు బస్సులు.
*సంబంధిత రాష్ట్రం ద్వారా తీసుకున్న నిర్ణయం ద్వారా రాష్ట్రం లో నడపబడే ప్రయాణికుల వాహనాలు మరియు బస్సులు.
*సూచించబడిన ప్రామాణిక పద్దతుల ద్వారా తరలించబడే వ్యక్తులుయొక్క వాహనములు.
*కంటైన్మెంట్, బఫర్, రెడ్, గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్ లలో
కేంద్రం వైధ్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా వెలువరించిన పరిమితులు అనుసరించి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్, గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్స్ ని గుర్తిస్తాయి.
*ఈ కంటైన్మెంట్ జోన్ లలో కేవలం అత్యవసర కార్యక్రమాలను మాత్రమే అనుమతిస్తారు.
*కేంద్ర వైద్య శాఖ వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం అత్యవసర వైద్య పరిస్థితుల్లో మరియు ఆ ప్రాంతం లోని వారికి నిత్యవసర వస్తువులను తరలించుటకు మాత్రమే అనుమతి ఇస్తారు.
*ఆ జోన్ లో ఉండే వ్యక్తులను ఇతర ప్రాంతాలకు మరియు ఇతర ప్రాంతాల వ్యక్తులను ఈ జోన్ లోనికి ఎట్టి పరిస్థితిలో అనుమతించరు.
*కంటైన మెంట్ జోన్ నందు కాంటాక్ట్ ట్రెసింగ్ కొరకు ఇంటింటికి సమగ్ర విచారణ చేపడుతారు. మరియు దానికి అనుగుణంగా ఆరోగ్య చర్యలు చేపడుతారు.
*రాత్రి పూట వ్యక్తుల కదలికలు నిరోధించడానికి కర్ఫ్యు అమలుచేయడం. సెక్షన్ 144 అనుసరించి వ్యక్తుల కదలికలపై ఆంక్షలు విధించబడతాయి. సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకూ రాత్రిపూట కర్ఫ్యు విధించబడుతుంది.
*అత్యవసర సేవల నిమిత్తం మాత్రమే వ్యక్తుల కదలికలకు అనుమతిస్తారు.
*కుటుంబసభ్యులకు తగిన రక్షణ కల్పించడం.
*కుటుంబం లో 65సంవత్సరాలు నిండిన వ్యక్తులు,
*ఒకటి కంటే ఎక్కువ అనారోగ్యాలతో బాధపడే వ్యక్తులు,
*గర్భిణీ స్త్రీలు మరియు 10 సంవత్సరాల లోపు ఉండే చిన్నపిల్లలు అత్యవసర వైద్య సేవలు అవసరపడిన సందర్భం లో మినహా మిగిలిన సమయాల్లో కేవలం ఇంట్లోనే ఉండాలి.
ప్రత్యేక ఆదేశాలు.
*మెడికల్ ప్రొఫెషనల్స్ , నర్సులు, పేరా మెడికల్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది మరియు అంబులెన్స్ ల కదలికలు రాష్ట్రం లోనూ మరియు అంతర్ రాష్ట్ర ల మధ్య ఎలాంటి పరిమితులూ లేకుండా అనుమతించబడతాయి.
*రాష్ట్రం లో మరియు రాష్ట్రాల మధ్య అన్నీ రకాల గూడ్స్/ కార్గో రవాణా అనుమతించ బడుతుంది.
*ఇవే కాకుండా కాళీ గా వెళ్ళే ట్రక్ లను సైతం అనుమతించ బడతాయి.
*పొరుగు దేశాలతో ఉన్న ఒప్పందాలు ప్రకారం క్రాస్ లాండ్ సరిహద్దు వద్ద ఎటువంటి కార్గోను/గూడ్స్ రవాణాను ఏ రాష్ట్రమూ ఆపకూడదు.
ప్రతి పౌరుడికి ఆదేశాలు.
*ఇంటిలో నుండి బహిరంగ ప్రదేశాలకు మరియు పని చేయు ప్రాంతమునకు వెళ్ళుటకు గాను బయటకు వచ్చే ప్రతి వ్యక్తి ముఖముకు సరైన మాస్కు ధరించాలి.
*బహిరంగ ప్రదేశాలు మరియు పనిచేయు ప్రాంతములలో ఉమ్మి వేయకూడదు
*పనిచేయు ప్రాంతం లో బహిరంగ ప్రదేశాలలో మరియు ప్రయాణాలలో సూచించిన విధంగా వ్యక్తి కి వ్యక్తికి మధ్య కనీస దూరం పాటించాలి.
*వివాహ వేడుకలకు సంబంధించి హాజరు అయ్యే బంధువుల సంఖ్యను 50 మందికి లోపు మాత్రమే పరిమితం చేయబడినది. మరియు వీరు వివాహ కార్యక్రమం లో వ్యక్తికి వ్యక్తికి మధ్య సరైన దూరం పాటించవలసి ఉంటుంది.
*చనిపోయిన వ్యక్తికి సంబంధించి అంత్యక్రియలు హాజరు కు గాను కేవలం 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. మరియు వారు వ్యక్తికి వ్యక్తికి మధ్య సరైన దూరం పాటించవలసి ఉంటుంది.
*బహిరంగంగా కిళ్ళీలు, గుట్కా మరియు పొగాకు నమలడం మద్యపానం సేవించడం వంటి పనులు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించరు.
*షాపుల యందు కొనుగోలు చేసే వ్యక్తుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూడాలి, మరియు షాప్ లోనికి ఒకే సారి 5 కంటే ఎక్కువమంది సభ్యులను అనుమతించకూడదు.
*పనిచేయు ప్రదేశములో పాటించవలసిన చర్యలలో ఇవ్వబడిన అదనపు ఆదేశాలు.
*అవకాశం ఉన్నంత వరకూ ఇంటివద్దనుండే కార్యక్రమాలు నిర్వహించుటకు ప్రయత్నం చేయాలి.
*ఆఫీసు కార్యాలయాలు, పని ప్రాంతాలలో, షాపులు, బజార్లు, పరిశ్రమలు మరియు వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ కొరకు అందరూ ఒకే సమయం పాటించకుండా వేర్వేరు సమయ విధానాలను పాటించాలి.
*ఉమ్మడి ప్రాంతములోనికి ప్రవేశ మరియు నిర్గమ మార్గమునందు థర్మల్‌ స్క్రీనింగ్ మరియు హాండ్ శానిటైజర్లను ని నిర్వహించాలి.
*కార్యాలయాల్లో షిఫ్టు ల మధ్య సమయం లో పనిచేయు ప్రదేశాన్ని, ఉమ్మడి ప్రాంతాలను, తరచుగా తాకే వస్తువులైన డోర్ హ్యాండిల్ మొదలగు వస్తువులను తరచుగా శానిటైజ్ చేయాలి.
*కార్యాలయ నిర్వాహకులు పనిచేయు ఉద్యోగుల మధ్య సరైన దూరం, షిఫ్ట్ మధ్య సరైన ఖాళీ సమయం, మరియు ఉద్యోగుల భోజన సమయాలు ఒకరికి ఒకరికి అస్థిరంగా ఉండేలా నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాలి.
రాష్ట్ర ప్రభుత్వ సూచనలు
*కారులో ముగ్గురికి మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉంటుందని తెలిపారు.
*పెళ్ళిళ్ళు వంటి కార్యక్రమాలకు 50 మందికి మాత్రమే అనుమతి
*రెస్టారెంట్లలో భోంచేయడం వీలుకాదు
*రెస్టారెంట్ల నుంచి పార్శిల్ తీసుకెళ్లేందుకు అనుమతి అది కూడా భౌతికదూరం పాటిస్తూ పార్శిల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది
*ఇక, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వెల్లడించారు.
*దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచేందుకు అనుమతి
*ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండటం ప్రతి పౌరుడి కర్తవ్యం
తమని తాము కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడు పైన ఉన్నది!!
*సురక్షితంగా ఉంటూ కరో నాని ఎదుర్కొందాం!!!