మరొక ఆర్టీసి కార్మికుడి ఆత్మహత్యా యత్నం

తెలంగాణ ఆర్టీసి సమ్మెను పరిష్కరించేందుకు ప్రభత్వం నుంచి పెద్దగా ప్రయత్నం లేకపోవడం, సమ్మె కొనసాగుతూ ఉండటంతో కార్మికు ల జీవితాలలో ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతూ ఉంది. ఈ రోజు  తొర్రూరు ఆర్టిసి డిపో లో మెకానిక్ గా పనిచేస్తున్న మేకల అశోక్  పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంచేశాడు.  పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తున్నది. ఆయన్ని వెంటనే  స్థానికంగా ఉన్న ఒక  ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వివరాలు అందాల్సి ఉంది.
నిన్న మహబూబాబాద్ కుచెందిన ఆవుల నరేశ్ అనే డ్రైవర్ కూాాడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. రెండు నెలలుగా జీతం రాకపోవడంతో ఆర్థికంగా చితికిపోవడం, తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటాటోడో లేదో అనే ఆందోళన ఆయన ఈ చర్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
తన ఆత్మహత్యకు కేసిఆరే కారణమని, సెల్ఫ్ డిస్మిస్ అంటూ కేసిఆర్ చేసిన ప్రకటన వల్లే తాను కుమిలిపోతున్నానని నరేశ్ రాసిన ఆత్మహత్యలేఖలో పేర్కొన్నాడు. నరేశ్ యూనియన్ నాయకుడు కూడా. ఆయన సరే ఆయన గుండెనిబ్బరం కోల్పోయాడు. అంటే ప్రభుత్వం మొండికేయడంతో  ఆర్టీసి కార్మికుల జీవితాలలో ఎంత సంక్షోభం నెలకొనిందో  తెలుస్తుంది. ఈ ఆత్మహత్యలను ప్రభుత్వం లో ఉన్నవాళ్లు సీరియస్ గా తీసుకుంటున్నట్లు లేరు.