అధికారానికొచ్చి ఆర్నెళ్లు కాలే, ఇన్ని సమస్యలా: పవన్ ప్రశ్న

వైసిపి అధికారంలోకి వచ్చి అర్నెళ్లు కాలేదు అప్పు ఇన్ని సమస్యలా; కొద్ది రోజులు ప్రభుత్వానికి సమయం ఇద్దా మనుకున్నా. అయితే, ఆర్నెళ్ల లోపే నన్ను రోడ్డు మీదకి, మళ్లీ జనంలోకి లాక్కొచ్చారు, అని జనసేన నేత పవన్ కల్యాణ్ ఈ రోజు వైజాగ్ లో ఇసుకు కోసం జరిగిన లాంగ్ మార్చ్ లో వ్యాఖ్యానించారు.
ఇప్పుడు కూడా నాతో నాతో పాటి ఎంతో మంది కార్మికులు, జనసైనికులు, ఆడపడుచులు తో సహా రోడ్డు మీదకు వచ్చి గళం విప్పారు అంటే.. ప్రభుత్వం విఫలం చెందిందనే.  వైసీపీ ప్రభుత్వం పనిచేయడం లేదని  వైసిపి వాళ్లు అర్థం చేసుకోవాలి..
అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు అప్పుడే సమస్యలతో రోడ్డుమీదికి రావాల్సిన పరిస్థితి.
నన్ను విమర్శించే నాయకుల్లాగా నా దగ్గర వేల కోట్లు లేవు.. వేల ఎకరాలు కూాాడా లేవు..
ఎవడికి దమ్ముంది? ఎవడికి దమ్ము లేదు!  ఒక పార్టీ పెట్టి మాట్లాడండి, చూద్దాం.
వైసీపీ నాయకులకు సభాముఖంగా చెబుతున్నా; 2014లో రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు వ్యతిరేకించడానికి  మీలో  ఎవరికి ధైర్యం లేదు.. తెలంగాణలో నడి బొడ్డున కూర్చుని మాట్లాడే ధైర్యం లేని మీరు విమర్శించడమా..
తెలంగాణ ఆంధ్ర ప్రజల మన్ననలు పొందినా కాబట్టి ఈ రోజు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల బాధ గుచ్చుకుంటే వాళ్లకి అండగా ఉన్నా..
అధికారం కోసం అరువులు చాచే వ్యక్తిని కాదు డబ్బులు కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదు.
కోట్లు వచ్చే సినీ పరిశ్రమని వదిలేసా..
పార్టీని నడపటం అంటే ఆషామాషీ అనుకుంటున్నారా..నేను పార్టీ పెట్టి ఒక భావజాలంతో ముందుకు వెళ్తున్నా. పార్టీ కోసం ప్రాణాలిస్తా మీరు ఇవ్వగలరా..
రాష్ట్ంలో 36 మంది భవన కార్మికులు చనిపోవడం చాలా బాధ కలిగిస్తుంది..
వైసిపి వాళ్ళు అంటున్నారు- సమయం ఇవ్వరా అని నిజంగానే సమయం ఇద్దామనుకున్నాను. కాని జరిగిందేమిటి?
జగన్ అద్భుతమైన పాలన ఇస్తే నేను వెళ్లి సినిమాలు చేసుకుంటా…
సగటు రాజకీయ నాయకులు ప్రజల పట్ల బాధ్యతగా ఉండి ఉంటే నాకు జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు..
నేను కార్మికుల మధ్యన తిరిగిన వాడిని కష్టం ఏంటో చూశాను మోస్తాను. ఈరోజు భవన కార్మికుల కష్టం బలంగా తాకింది నాకు..
ఈరోజు భవన కార్మికులు రోజువారి కూలీలు పనికి వెళ్లి వచ్చిన డబ్బులతో పిల్లల్ని పోషించుకుంటూ ఉంటారు..
ఈరోజు మీరుంటున్న ఉంటున్న భవనాలు ఆ భవన కార్మికులు కట్టించింది కాదా..
ఒక భవన నిర్మాణం ఆగిపోతే ఎంతో మంది జీవితం రోడ్డు పాలవుతుంది..
వైసీపీ వాళ్ళు మనకు శత్రువులు కాదు..
మంత్రి కన్నబాబూ,  మీరు కూడా ఇతర మంత్రుల లాగా విమర్శిస్తున్నారు మిమ్మల్ని రాజకీయాల్లో తీసుకువచ్చింది నాగబాబు.మీ బతుకులు తెలియవా మీరు ఎక్కడి నుంచి వచ్చారు…
ఓడిపోయామని చులకనగా మాట్లాడుతున్నారు, ఓటమి-గెలుపు కావు పోరాటమే ముఖ్యం మాకు
ఒక కార్మికుడు కష్టాలతో కన్నీళ్లు పెడుతుంటే తుడవడం తెలుసు మాకు..
ఇసుకను తేలిగ్గా తీసుకోవద్దని  వైసీపీ ప్రభుత్వానికి చెబుతున్నా.