జగన్ ఒక్క దెబ్బతో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాడు: మోహన్ దాస్ పాయ్

అమరావతి రాజధాని స్టార్టప్ ఏరియా కాంట్రాక్టును ఆంధ్రప్రదేశ్ రద్దు చేసుకుని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ ను దెబ్బతీశారని ప్రముఖ ఐటిఇన్నొవేటర్ టెక్ ఇన్వెస్టర్ల మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. ఈ రోజు సింగపూర్ ప్రభుత్వం నుంచి స్టార్టప్ ఏరియా ప్రాజక్టును రద్దు చేసుకోవడం మీద వచ్చిన ప్రకటన అనంతరం ఆయన ఇలా స్పందించారు. సింగపూర్ ప్రభుత్వం చాలా గౌరవప్రదంగా ఈ ప్రెస్ నోటో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేసేందుకు ఏర్పాటయిన సింగపూర్ కన్సార్టియమ్ పరసర్పరాంగీకరాంతోనే కాంట్రాక్టు ను రద్దు చేసుకున్నాయని సింగపూర్ ట్రేడ్ రిలేషన్స్ మంత్రి ఎస్ ఈశ్వరన్ పేర్కొన్నా అది అంత సుహృద్బావ వాతావరణంలో జరిగి ఉంటుందని ఎవరూ అనుకోరు.ఎందుకంటే, కన్సార్టియమ్ కొన్నిమిలియన్ల డాలర్లను కోల్పోయిందని మంత్రి స్పష్టంగా రాశారు.
ఈనేపథ్యంలో పాయ్ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. ‘ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి స్టార్టప్ ఇన్ ఫ్రా వర్క్ రద్దుచేసుకుంది. సింగపూర్ సంస్థ వెనక్కి వెళ్లిపోయింది. ఇదే మాత్రం మంచిది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ కు దుర్వార్త. హరాకిరి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సింగిల్ హ్యాండెడ్ గా ఎపి మీద ఇన్వెస్టర్లకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీశారు. ఉద్యోగాలు దెబ్బతిన్నాయి. అభివృద్ధి పోడిపోయింది. ఇక ఇన్వెస్టర్ ఇందుకు అక్కడ పెట్టుబడులు పెడతారు. దురదృష్టం. అని ఆయన వ్యాఖ్యానించారు.
మోహన్ దాస్ పాయ్ దేశంలో బాగా పేరున్న, అనేక అవార్డులు తీసుకున్న సిఎఫ్ వొ. అంతేకాదు, ఆయన భారత్ స్టార్టప్ సక్సెస్   స్టో రీ వెనక ఉన్న కీలకమయిన వ్యక్తి.