పౌరసత్వ బిల్లుకు నిరసనగా ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐపిఎస్ అధికారి

కేంద్రం తీసుకువస్తున్న పౌరసత్వ సవరణ బిల్లు (CAB)కు నిరసన వ్యక్తం చేస్తూ సీనియర్ ఐపిఎస్ అధికారి అబ్దుర్ రహమాన్ రాజీనామా చేశారు.

ఈ బిల్లు రాజ్యసభలో పాసయిన వెంటనే ఆయన తాను ఇండియన్ పోలీస్ సర్వీస్ కు రాజీనామాచేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ట్విట్టర్ లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాను ఈ బిల్లు మీద మొదలయిన సహాయకరణలో భాగంగా ఉద్యోగానికి రాజీనామాచేస్తున్నానని, ఈ బిల్లు భారత మతబాహళ్య (Religious Pluralism) స్వభావానికి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. “The Bill is against the religious pluralism of India. I request justice loving people to oppose the vill in a democratic manner. It runs against the very basic feature of the Constitution,” అని ఆయన ట్వీట్ చేశారు. రహ్మాన్ మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి. ప్రస్తుతం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఐజిపి గా ఉంటున్నారు. నిజానికి ఆయన ఆగస్టులోనే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ప్రభుత్వం దానిని తిరస్కరించింది.