ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ రెడీ అవుతూ ఉంది?

వచ్చే మార్చి నాటికి  ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో భారత దేశంలో ఉంటుంది.
దాని పేరు సర్దార్ పటేల్ స్టేడియం. ఇది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో మోతేరా ప్రాంతంలో నిర్మాణం అవుతూ ఉంది. 2020 మార్చిలో దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
ఇంతరకు ఆస్ట్రేలియా మెల్ బోర్న్ స్టేడియం ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఇక్కడ దాదాపు లక్ష మంది ప్రేక్షకులు కూర్చుని మ్యాచ్ చూసేందుకు వీలుంది.
అయితే, మోతేరా స్టేడియం పునర్నిర్మాయమయితే లక్షా పదివేల మంది కూర్చునేందుకు సీట్లుంటాయి. ఇపుడు మోతేరాస్టేడియం కెపాసిటీ కేవలం 49 వేల సీట్లు మాత్రమే. అందుకే దీనిని పునర్నిర్మించి ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం చేయాలని గుజరాత్ భావించింది. దీనికి సుమారు 700 కోట్లరుపాయలు ఖర్చవుతున్నాయి.
మోతేరా స్టేడియం పునర్నిర్మాణం 2017 జనవరిలో మొదలయింది. అనుకున్నట్లు 2020 మార్చినాటికి పూర్తవుతుందని గుజరాత్ క్రికెట్ అసోయేషన అధికారులు భావిస్తున్నారు.
ఈ స్టేడియం 63 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇందులో 53 రూములున్న క్లబ్ హౌస్, ఈత కొలను ఉంటాయి. ఇందులో మరొక 76 కార్పరేట్ బాక్స్ లుంటాయి. స్టేడియాన్ని ఎల్ అండ్ టి కంపెనీ నిర్మిస్తూ ఉంది. గుజరాత్ లో ఆ మధ్య ఏర్పాటుచేసిన సర్దార్ పటేల్ యూనిటీ విగ్రహం కాంట్రాక్టర్  కూడా ఎల్ అండ్ టీ కంపెనీయే.
స్టేడియం పూర్తవుగానే వరల్డ్ XI vs Asia XI మధ్య ప్రారంభోత్సవ మ్యాచ్ ఉంటుందనకుంటున్నారు.
ఇక ఇక్కడ టెస్ట్ క్రికెట్ తో  పాటు వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ లు ఇక రెగ్యులర్ గా జరగుతాయి.