ప్రపంచమంతా ఉద్యమాలే, హాంకాంగ్ లో ఏం జరిగిందో తెలుసా?

ప్రపంచంలో చాలా దేశాలలో నిరసనోద్యమాలు పెల్లుకుతున్నాయ్. ఈక్వడార్, లెబనాన్, చిలీ,బొలీవియా, స్పెయిన్, ఇరాన్, హాంకాంగ్ …రకరకాల ఆశయాలతో విద్యార్థులు యువకులు అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. ఎన్నో మైళ్ల దూరానా ఉన్న వీళ్లందరిలో ఉన్న  కామన్ క్వాలిటీ ఏమిటంటే అసంతృప్తి, నిరసన.  ఈ దేశాల విద్యార్థులంతా ఒకరినుంచొకరు ఉత్తేజం పొందుతున్నారు. ప్రభుత్వంలో అవినీతి, ఇంధనం ధరలు పెరగడం, నిరుద్యోగం, ధరలు పెరగడం, ప్రజాస్వామ్యం  ఆకాంక్ష ఈ ఉద్యమాలను రాజేస్తు ఉంది. చైనా ఆదీనంలో ఉన్న హాంకాంగ్ ఇలాంటి ఉద్యమాల వల్ల అంతర్జాతీయ వార్తయింది.  హాంకాంగ్ విద్యార్థుల ప్రజాస్వామ్య  కాంక్ష చివరకు ఎన్నికల్లో కూడా ప్రతిబింబించింది. ఇది ఎటువోతుందోతెలియదుగాని, ఇప్పటికయితే, హాంకాంగ్ విద్యార్థుల ఉద్యమం అక్కడి ప్రజలను చైనా కమ్యూనిస్టు ప్రఃభుత్వానికి వ్యతురేకంగా ప్రజలు తీర్పు ఇచ్చేలా చేసింది.
హాంకాంగ్ లో చైనా కమ్యూనిస్టు పార్టీ అనుకూల వర్గం ఓడిపోయింది. దారుణంగా ఓడిపోయింది.  హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ 18 జిల్లాలలోని  452 జిల్లా కౌన్సిళ్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో చైనా కమ్యూనిస్టు పార్టీకి  పది శాతం ఓట్లు కూడా రాలేదు.  392 స్థానాలను చైనా ప్రభుత్వం వ్యతిరేక ప్రజాస్వామ్య అనుకూల అభ్యర్థులు గెల్చుకున్నారు. ప్రభుత్వ అనుకూల అభ్యర్థులు కేవలం 60 కౌన్సిల్ స్థానాలలో మాత్రమే గెలుపొంందారు.
హాంకాంగ్ గత కొద్ది రోజులుగా విద్యార్థుల ఉద్యమాలతో కుతకుత లాడుతన్న సంగతి తెలిసిందే. హాంకాంగ్ లో  ప్రజ్వాస్వామ్య వ్యవస్థ ఉండాలని, చైనా పెత్తనం ఉండరాదని విద్యార్థులు ఆరునెలలుగా  ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.
చైనా క్యమూనిస్టు పార్టీ మాత్రం ఒక దేశం రెండు వ్యవస్థలంటూ చైనా ప్రధాన భూభాగంలో సోషలిజం, హంకాంగ్ లో క్యాపిటలిజం ఉంటాయనే నినాదంతో విద్యార్థులమీద విరుచుకూడుతూ ఉంది.  హాంకాంగ్ ను చైనాకు బదిలీ చేస్తున్నపుడు  బ్రిటన్, చైనా ల మధ్య ఈ మేరకు ఒక ఒప్పందం కూడా జరిగింది. అయితే,  హాంకాంగ్ చైనాకు బదిలీ అయి దాదాపు 22 సంవత్సరాలయినా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం హాంకాంగీయులు మనసు ఆకట్టుకోలేకపోయిందని ఈ ఎన్నికల ఫలితాలు చెబుతాయి.
ఈ డిస్ట్రిక్ట్ కౌన్సిళ్లకు ఏ మాత్రం అధికారం ఉండకపోయినా, ఈ ఎన్నికలు హాంకాంగ్ వ్యవస్థను మార్చేందుకు ఉపయోగపడకపోయినా, ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ పరాజయం అనేది హాంకాంగ్ వాసులు మనోగతం వెల్లడించింది.  హాంకాంగ్ ప్రజలు చైనా ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఎన్నికలు నవంబర్ 24న జరగాయి.