మాజీ మంత్రి అచ్చన్నాయుడు అరెస్టు, ESI 150 కోట్ల స్కామ్ లో ACB దాడులు

మాజీ మంత్రి, తెలుగుదేశం  శాసన సభ ప్రతి పక్ష ఉప నేత కింజరాపు అచ్చెన్నాయుడిని నిమ్మాడలో ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటిమీద తెల్లవారగానే  ఎపిబి దాడులు జరిగాయి. కార్మిక మంత్రిగా ఉన్నపుడు ఇఎస్ ఐ లో జరిగిన స్కామ్ మీద దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే
ఈ కేసులోనే  ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని  అరెస్ట్ చేశారని చెబుతున్నారు. ఆయన కుటుంబ సభ్యలను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ తెల్లవారు జామున శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామానికి విజయవాడ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఎసిబి అధికారులు వచ్చారు.
ఆయనను  అదుపులోకి తీసుకొని అదే ప్రత్యేక బస్సులో  తమతో  ఎసిబి అధికారులు తీసుకెళ్లారు. ఎసిబి దాడుల సందర్భంగా  నిమ్మాడ గ్రామంలో ప్రత్యేక బలగాలను మోహరించారు.
అరెస్టు గురించి వారి కుటుంబ సభ్యులకు తెలియచేశారు. అయితే, నాన్నని బలవంతంగా లాక్కెళ్లారని ఆయన కుమారుడు చెబుతున్నారు.
అచ్చన్నాయుడు ఈ మధ్యే అపరేషన్ చేయించుకున్నారని, ఆరోగ్యం బాగాలేదని భార్య విజయ మాధవి చెప్పారు. “పొద్దున ఏడున్నర సమయంలో చాలా మంది అధికారులు గోడదూకి వచ్చారు. ఆయన నిన్ననే సర్జరీ జరిగింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమన్నారు. వచ్చిందే తడవుగా వాళ్లు ఆయనని తీసుకెళ్లిపోయారు. ముందులు వేసుకునేందుకు కూడా అనుమతించలేదు,’ అని ఆమె చెప్పారు. గోడ దూకి వచ్చి  తీసుకెళ్లవలసిన అవసరం ఏమిటి? అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
 అయితే, ఇది కిడ్నాప్ అని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. అచ్చెన్నాయుడు కిడ్నాప్‌కు జగన్‌ బాధ్యత వహించాలని,  హోంమంత్రి రాజీనామా చేయాలని పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

https://trendingtelugunews.com/telugu/breaking/atchannaidu-kidnpa-chandrababu-naidu-demands-immediate-release-acb-raids-esi-scam/

ESI డిపార్ట్‌మెంట్ లో అవినీతి జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తున్నది.
ESI స్కీం లో పరికారల కొనుగోళ్లలో కోట్లరూపాయల అవినీతికి  మాజీ మంత్రి, మెడికల్ ఇన్స్యరెన్స్  డైరెక్టర్  పాల్పడ్డారనేది ఆరోపణ. 2014 నుంచి  2018-19 కాలం లో DIMS డైరెక్టర్ రమేష్ కుమార్ గా ఉన్నారు.  ఇదంతా నాటి మంత్రి అచ్చెన్నాయుడు పర్యవేక్షణలోనే జరిగిందని చెబుతున్నారు.

టెండర్లు పిలవకుండా నామినేషన్‌ల పద్దతి లో అచ్చెన్నాయుడు చెప్పిన ఒక కంపెనీకు కోట్ల రూపాయల మందులు కొనుగోలుకు రమేష్ కుమార్ అర్డర్లు ఇచ్చినట్లు ఎసిబి అధికారులుప్రాథమిక దర్యాప్తులో కనుగొన్నారని తెలిసివది. ఇందుంలో  మొత్తం 155 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని  ACB కి  ప్రాథమిక అధారాలు కనిపించాయి. వాటి వివరాలు:
*డ్రగ్స్ &మెడిసిన్ కొనుగోళ్లలో 51 కోట్లరూపాయలు
*లాబ్ కిట్స్ పేరిట 85 కోట్లు
*సర్జికల్ ఐటంస్ లో 11 కోట్లు
*ఫర్నిచర్ పేరు పై 5 కోట్ల రూపాయలు
*టెలీహెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకు కాల్ సెంటర్/ ఈసీజీ సర్వీస్ లపేరిట 3 కోట్ల రూపాయలు
ఏసీబీ జేడీ రవికుమార్ ప్రకటన
– ఈఎస్సై స్కాంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ముగ్గురి అరెస్ట్ చేశాం.  అచ్చెన్నాయుడు, డాక్టర్ రమేష్ కుమార్, డాక్టర్ విజయ్ కుమార్ అరెస్ట్
– ఈ సాయంత్రం విజయవాడ ఏసీబీ కోర్ట్ లో ప్రవేశపెడతాం
– ఈ కేసులో డాక్టర్ జనార్ధన్, రమేష్ బాబు, చక్రవర్తిని అరెస్ట్ చేస్తాం
– అచ్చెన్నాయుడు అరెస్ట్ లో అన్ని నిబంధనలు ఫాలో అయ్యాం
– మందులు, వైద్య పరికరాల కొనుగోలులో 150 కోట్లకు పైగా అవినీతి గుర్తించాం
– ఇప్పటివరకు 19 మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించాం

https://trendingtelugunews.com/telugu/breaking/nara-lokesh-atchannaidu-arrest-vindictive-politics/

One thought on “మాజీ మంత్రి అచ్చన్నాయుడు అరెస్టు, ESI 150 కోట్ల స్కామ్ లో ACB దాడులు

Comments are closed.