చంద్రబాబు దీక్షకు అనుమతినీయాలి, వంకలు పెడితే ఒప్పుకోం:బోండా

భవన నిర్మాణ కార్మికులకు అండగా టిడిపి ఉంటుందని,దీనిని ప్రకటించేందుకే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈనెల 14న నిరాహారదీక్ష చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ  ప్రకటించారు.
ఆ రోజు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు 12గంటల పాటు  చంద్రబాబు దీక్ష లో ఉంటారని ఆయన చెప్పారు.
చంద్రబాబు దీక్షకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని వేదికగా నిర్ణయించామని, దీక్షకు అనుమతుల కోసం అధికారులకు మా నేతలు అర్జీలు పెట్టారని ఆయన చెప్పారు.
వంకలు వెతక్కుండా  జడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబు దీక్షకు అనుమతి ఇవ్వాలని,లేకపోతే వూరుకోమని ఆయన అన్నారు.
విజయవాడలో మాట్లాడుతూ బోండా ఇంకా ఏమన్నారంటే…
మంత్రులే స్వయంగా ఇతర రాష్ట్రాలకు లారీ లక్ష చొప్పున పంపిస్తున్నారు
డబ్బు పిచ్చి పట్టిన ఈ ప్రభుత్వం తీరు వల్ల భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఇప్పటికే 36మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా చలనం లేదు
ప్రకృతి ప్రసాదించిన ఇసుక పై ప్రభుత్వం కర్ర పెత్తనం చేస్తుంది.విపక్షాలు అన్నీ ఉద్యమిస్తుంటే సిగ్గు లేకుండా ఎదురుదాడి చేస్తున్నారు
వరదలు వస్తే ఇసుక ఎలా తీస్తాం అని మంత్రులు అంటున్నారు.లారీలకు లారీలు ఇసుక ఇతర రాష్ట్రాలకు ఎలా వెళుతున్నాయో చెప్పాలి.వైసిపి ఇసుక మాఫియాను అరికట్టే వరకు మా పోరాటం కొనసాగిస్తాం
ప్రజా సమస్యలు స్పందించే వారెవరైన. అందరినీ కలుపుకుని వెళతాం