Home Breaking రామజన్మభూమి హిందువులకే, అయోధ్యలో రామాలయం, మసీదు నిర్మిస్తారు:తీర్పు

రామజన్మభూమి హిందువులకే, అయోధ్యలో రామాలయం, మసీదు నిర్మిస్తారు:తీర్పు

SHARE
దశాబ్దాలుగా మాననిపుండులాాగా సలుపుతూ వచ్చిన  అయోధ్య భూవివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది.
అయోధ్య వివాదం ఈ రోజు సమసిసోయినట్లే.
అయోధ్య లో వివాదంలో ఉన్న 2.77 ఏకరాల భూ వివాదం మీద సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం చాలా స్పష్టమయిన తీర్పు ఇచ్చింది.
ఈ భూమిని హిందువులకు అప్పగిస్తూ తీర్పు ఇచ్చింది. అంతేకాదు, ముస్లిం వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే ఒక ముఖ్యమయిన చోట అయిదెకరాల భూమిని ప్రత్యామ్నాయంగా  ఇవ్వాలని కోర్టు చెప్పింది. 40 రోజుల పాటూ రోజూ వాదోపవాదాలు విన్న తర్వాత  ధర్మాసనం రోజు తీర్పు చెప్పింది.
2.77 ఎకరాల  స్థలంలో రామాయంలో, అయిదు ఎకరాల జాగాలో మసీదు వస్తాయి.
 తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చదవివినిపించారు.
కోర్టు శెలవు అయినా శనివారం నాడు తీర్పు ఇవ్వాలనుకోవడం విశేషం.
తీర్పును ముస్లిం సంస్థలు కూడా స్వాగతించాయి. తాము అసంతృప్తిగానే ఉన్నా తీర్పు స్వాగతిస్తున్నామని, తీర్పును పరిశీలించాక రివ్యూకు వెళ్లే విషయం పరిశీలిస్తామని ఈసంస్థలు తెలిపాయి.
ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ ఎ బాబ్డి, జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ చంద్రచూడ్,  జస్టిస్ నజీర్అహ్మద్ లు ఉన్నారు.
రామజన్మ భూమిగా హిందువులు భావిస్తున్న ప్రదేశం మీద వివాదంలేదని, అక్కడ ఉన్న సీతా రసోయ్, రామచబూత్ర, బండార్ గృహం దీనికి సాక్ష్యం అని కోర్టు పేర్కొంది.
ఇంత మాత్రాన భూమి టైటిల్ ను నిర్ణయించలేమని, ఇది ఒక సూచన మాత్రమేనని కోర్టు పేర్కొంది.
కోర్టు పురావస్తు శాఖ  తవ్వకాల ఫలితాలను బాగా పరిగణనలోకి తీసుకుంది.
1992 లో బాబ్రి మసీదును ధ్వంసం చేయడమనేది చట్టాన్ని ఉల్లంఘించడమే నని  కోర్టు స్పష్టం చేసింది.
అలాగే 1940దశకంలో మసీదులో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టంచడం కూడా తప్పేనని కోర్టు స్పష్టం చేసింది.
ఇక వివాదంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని ఒక ట్రస్టు కు అప్పగించాలని కోర్టు చెప్పింది. అక్కడ రామాలయం నిర్మిస్తారు.  మూడునెలలో  రాష్ట్ర ప్రభుత్వం తో సంప్రదించి ట్రస్టును   కేంద్రం ట్రస్టును ఏర్పాటుచేయాలి. ట్రస్టులో నిర్మోహి అకాడ కూడాట్రస్టులో భాగస్వామి కావాలి.
నిర్మొహి అఖాడ సూట్ ను కోర్టు తిరస్కరించింది.నిర్మోహి అకాడ కేవలం మేనేజ్ మెంట్ బాడీయే. ఇది షాబియత్ కాదు. అంటే రామభక్తుడు కాదు.
బాబ్రి మసీదును నిర్మించింది మీర్ బకి. మత సంబంధ వ్యవహారంలోకి కోర్టు వెళ్ల దలుచుకోలేదు.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధన ప్రకారం మసీదు కింద ఆలయం ఉండిందని చెప్పింది. మందిర్ ని కూల్చిమసీదును కూల్చారా అనే విషయాన్ని ఎస్ ఎస్ ఐ చెప్పలేదు.
మసీదు కింద ఒక నిర్మాణం ఉండిందని, అది ఆలయమని, ఆలయాన్ని కూల్చిమసీదు కట్టారనే విషయంలో స్పష్టత లేదని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ చెప్పారు.
అయితే   మసీదును ఖాలీ జాగా లో కట్ట లేదని కూడ ఎఎస్ ఐ చెప్పిన విషయాన్ని కూడా ప్రధానన్యాయమూర్తి ప్రస్తావించారు.
అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకాభిప్రాయ తీర్పు ఇస్తున్నదని ఆయన చెప్పారు.
కోర్టు విశ్వాసాలను, నమ్మకాలను కూడా స్వీకరించాల్సి ఉంటుంది. వీటిన్నంటి మధ్య సమతౌల్యంపాటించాలి.
వివాదాస్పద 2.77 ఎకరాల భూమి తమకే చెందాలన్న  షియా వక్ఫ్ బోర్డు వేసిన ఎస్ ఎల్ పిని కోర్టు కొట్టి వేసింది. రెవిన్యూ రికార్డులప్రకారం ఈ భూమిని ప్రభుత్వం భూమి అని కోర్టు పేర్కొనింది.
భూమి తమదేనని చెప్పేందుకు ఈ బోర్డు ఎలాంటి పత్రాలు చూపించలేకపోయిందని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.
హిందువులు దీనిని రామజన్మభూమి గా పిలుస్తున్నారు. అక్కడ బయట  హిందువులు పూజలు చేస్తూ వచ్చారు.చరిత్ర ప్రకారం శాంతియుతంగా ప్రార్థనలు చేస్తూ వచ్చారు.
హిందువులు ఆవరణలో ప్రార్థనలు చేస్తూవచ్చారు.ముస్లింలు బాబ్రిమసీదులోపల ప్రార్థనలు చేస్తూ వచ్చారు. ప్రార్థనలుచేయకుండా  హిందువులను ఎవరూ ఆపలేదు.

1992 లో కూల్చేసిన బాబ్రి మసీదు