రిశాట్ 2 బి ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ (వీడియో)

శ్రీహరికోట లో పీఎస్ఎల్వి సి-46 రాకెట్ ను  విజయవంతంగా ప్రయోగించారు.ఈ ఉదయం  ప్రయోగించిన 15.నిమిషాల 30 సెకన్లలోనే నిర్విఘ్నంగా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టి  షార్  శా స్త్రవేత్తలు  సంబరాలు జరుపుకున్నారు.  ఈ ఏడాది ఇది వరసగా షార్ కు  మూడో విజయం. ఇక అంతరిక్షం నుండి రిశాట్ 2 బి (రాడార్ ఇమేజింగ్ శటిలైట్ 2 బి) ఉపగ్రహం సేవలు లభిస్తాయి.ఇది భూమండలాన్ని పరిశీలించే ఉపగ్రహం. ఇది  5సంవత్సరాలు పని చేయనుంది. దేశానికి  ఇది చాలా ముఖ్యమైన ఉపగ్రహమని ఇస్రో ఛైర్మన్ శివన్ చెప్పారు. 2009 లో ప్రయోగించిన రిశాట్ 2 స్థానంలో ఇది పని చేస్తుంది. ఈ ఉపగ్రహం బరువు 615 కేజీలు. ఇది శ్రీహరి కోటనుంచి జరిగిన 48వ ప్రయోగం.

జూలై లో చంద్రయాన్-2 ప్రయోగం ఉంటుందని ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *