Home Telugu కొడంగల్ లో టిఆర్ఎస్ అభ్యర్థికి అప్పుడే షాక్ (వీడియో)

కొడంగల్ లో టిఆర్ఎస్ అభ్యర్థికి అప్పుడే షాక్ (వీడియో)

98
0
SHARE

కొడంగల్ అంటే రేవంత్ రెడ్డి… రేవంత్ అంటే కొడంగల్ అన్నట్లుగా పరిస్థితి మారింది.

ఏ మాటకు ఆ మాట చెప్పుకుంటే కొడంగల్ వల్ల రేవంత్ కు ఎంత పేరు వచ్చిందో రేవంత్ వల్ల కొడంగల్ కు అంత పేరు వచ్చింది.

అసెంబ్లీ రద్దు నేపథ్యంలో కొడంగల్ టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు.

ప్రకటన వచ్చిందే తడవుగా పట్నం నరేందర్ రెడ్డి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని ఎన్నికల ప్రచారం షురూ చేశారు.

తాజాగా కొంతమంది రేవంత్ మనుషులను టిఆర్ఎస్ లో చేర్పించుకున్నారు. ఈ సమయంలో ఒక సభ జరిగింది.

ఆ సభలో టిఆర్ఎస్ లో చేరిన రేవంత్ అనుచరుడు ప్రసంగం మొదలు పెట్టిండు. పక్కన పట్నం నరేందర్ రెడ్డి ఉండగానే ఆయనకు షాక్ ఇచ్చేలా మట్లాడిండు.

ఎంతైనా రేవంత్ మనిషి కాబట్టి నరేందర్ రెడ్డికి మైండ్ బ్లో అయ్యేవిధంగా ప్రసంగం సాగింది.

మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి గురించి కూడా మాట్లాడి మరి నరేందర్ రెడ్డికి ఝలక్ ఇచ్చాడు.

ఆయన ఏమన్నాడో కింద వీడియో లో చూడండి.

సభలో ఆ కార్యకర్త అలా అనడంతో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. ఎంతైనా రేవంత్ మనిషి కదా అని సభలో ఉన్న వాళ్ళు సెటైర్ వేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here