రేవంత్ రెడ్డి రాయబారం విఫలం… సబితకు రూట్ క్లియర్

తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.  కాంగ్రెస్ నేత సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఆమె బుధవారం టిఆర్ఎస్ లో చేరనున్నారని తెలుస్తోంది. తన కుమారుడు కార్తీక్ కు చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్న సబితకు కాంగ్రెస్ నుంచి స్పష్టత రాలేదు. మరోవైపు, టీఆర్ఎస్ వర్గాలు సమయం చూసి సబితకు డబుల్ ధమాకా ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.
సబితకు మంత్రి పదవి, తనయుడు కార్తీక్ రెడ్డికి మరో కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతకు ముందు కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్లి సబితతో చర్చించినా ఆమె వినలేదు. దీంతో రేవంత్ రెడ్డి ఆమెతో చర్చాంచారు. రాహుల్ తో ఫోన్లో కూడా మాట్లాడించారు. ఆమె ముందుగా ఢిల్లీ వెళ్లడానికి ఒప్పుకున్నారు. కానీ ఇంతలో ఏం రాయబారం నడిచిందో తెలియదు కానీ ఆమె సడన్ గా యూ టర్న్ తీసుకున్నారు. ఢిల్లికి వెళ్లలేదు.
బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ తీసుకున్నారు. రేవంత్ రెడ్డి చేసిన చర్చలు కూడా ఫలించలేదు. సబిత అన్నింటిని డోంట్ కేర్ అంటూ టిఆర్ఎస్ లో చేరేందుకే సిద్దమయ్యారు. రేవంత్ రెడ్డి సబితతో చర్చించారని తెలిసాక నేరుగా సీఎం కేసీఆరే లైన్ లోకి వచ్చారని తెలుస్తోంది. సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడి డబుల్ ధమాకా ఆఫర్ ని ఇచ్చారని నేతలు చర్చించుకుంటున్నారు. ఏకంగా సీఎం హామీనివ్వడంతో సబితా కారెక్కేందుకు సిద్దమయ్యారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు డీలా పడ్డారు. చివరకు రేవంత్ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *