(టి. నాగార్జున రెడ్డి)
పెద్దల కాలంలో అదునుకు పదును కావడం, మన రాయలసీమ రైతులు సకాలంలో ఇత్తనం వేయడము జరిగేదేమో నాకు తెలియదు.
కానీ నేను చిన్నప్పటినుంచి చూస్తూ ఉన్న నిజమేమంటే ఎప్పుడు వర్షం వస్తే అదే అదునుగా భావించాల్సిన దుస్థితి.
అపుడే దేవుడి మీద భారమేసి ఇత్తనాలు భూమిలో పోస్తున్నామ్.
తరువాత వర్షాలు వస్తే పంట. లేకుంటే బ్రతుకు తంటాగా మారడం పరిపాటిగా మారింది అని నేను గమనించాను.
దీన్ని బట్టి చూస్తే మన రాయలసీమలో వ్యవసాయం జూదం లాంటిదైంది అనడంలో ఎంత మాత్రం ఆశ్చర్యము లేదు.
ముందు వర్షాలకు నమ్మి వేసిన పంటంతా నేడు ఎండు దశలో ఉన్న ఈ సమయంలో మన రాయలసీమలో వర్షం పడితే ఇక మన రాయలసీమ రైతన్న ఎడవాలో నవ్వాలో మీరే గమనించాలి.
ఇప్పుడు వచ్చిన వర్షానికి మరోసారి బతుకు పోరాటనికై సన్‌ప్లవర్ ,పప్పు శెనగ పంట వేయడానికి మన రాయలసీమ రైతున్న సకల శక్తులు వడ్డి సిద్ధపడుతారని మనము ప్రతి ఏడు గమనిస్తూనే ఉన్నామ్.
ఈ కష్టాలు, నష్టాలు భరించలేక పట్టణాల బాట పట్టిన మాలాంటి వారి డబ్బులను కూడా మన రాయలసీమ రైతు కుటుంబ సభ్యులు ఈ వ్యవసాయ జూదంలో ఓడ్డుతున్నారు. తమ ఈ దుస్థితికి దేవుడే కారణం అని అకారణముగా నిందిస్తూ ఉన్నారు కానీ మన రాయలసీమ ప్రజల కళ్ల ముందరే
సముద్రం పాలు అవుతూ ఉన్న వందల వేల టీ ఎమ్ సీ ల నీళ్లను మన రాయలసీమకు తరలించితే వాటితో భూగర్భ జలాలు పెరిగి, పచ్చదనంతో చెట్లు పెరిగి వర్షపాతం పెరుగుతుందని ఆలోచించని మన రాయలసీమ నాయకుల నయవంచన తరతరాలుగా కోనసాగుతూనే ఉంది. దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/che-guevara-most-viral-photo-in-the-world/