ఎందిది రైల్వే మంత్రి గారూ, ఎన్నికల కోడ్ ఏమైంది?

ఈ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ బాగా అభాసుపాలయింది. ఎన్నికల కమిషన్ తీరు మీద రాజకీయ పార్టీలే కాదు, మేధావులు కూడా దాడి చేశారు.

కమిషన్ మోకాళ్లు బలహీనపడిపయి నిటారుగా నిలబడలేకపోతున్నదని, దానికి చికిత్స చేయండని అనేక మంది మాజీ సైనిక దళాల అధిపతులు రాష్ట్రపతికి లేఖ రాశారు. అయినా ఎన్నికల కమిషన్ మోడెల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను ప్రధాని కార్యాలయం దగ్గిర నుంచి ఇతర శాఖలు గౌరవించేలా చేయలేకపోయింది.

ఈ సారి నియమావళిని బాగా ఉల్లంఘించిన వారిలో ప్రధానిమోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలను ప్రముఖంగాచెప్పుకోవాలని ప్రతి  పక్షాలంటున్నాయి. ఎందుకంటే, వారిద్దరు బాహాటంగా నియమావళిని, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి బాలకోట్, సైన్యం, సర్జికట్ స్ట్రయిక్స్  ప్రస్తావన    రోజూ తెస్తూనే ఉన్నారు.

ఇక రైల్వే శాఖ కూడా ఇదే దారిలోనే ఉంది. మొదట రైల్వే శాఖ  టికప్పుల మీద, ఎయిర్ ఇండియ బోర్డింగ్ పాస్ ల మీద మోదీ బోమ్మ ముద్రించి  విక్రయించింది. ఇందులో మొదటిటి బిజెపి వారి చౌకీదార్ ప్రకటన అయితే రెండో ది వైబ్రాంట్ గుజరాత్ ప్రకటన. దీని మీద    సోషల్ మీడియాలో గొడవ జరగడంతో  ఎన్నికల కమిషన్  అభ్యంతరం చెప్పింది. ఈ కప్పులను ఉపసంహరించరకుంటున్నామని చెప్పింది.

ఇపుడు తాజాగా మరొక ఘనకార్యం బయటపడింది. రైల్వే టికెట్ల మీద మోదీ చిత్రం ముద్రించి అందిస్తున్నారు. ఈ విషయాన్ని జీబాా వర్సి అనే మహిళ బయటపెట్టారు. ఆమె తనకు వచ్చిన టికెట్ మీద మోదీ చిత్రం ఉండటంతో ఆశ్చర్యపోయి టికెట్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

ఈ టికెట్ నిన్ననే అంటే ఆదివారం నాడు కొన్నదే దీని మీద గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ప్రకటన ఉంది. ఇలా  అనుమతి లేకుండా ప్రకటన వేయడం తప్పు.
మార్చి 10 నుంచి దేశంలో మోడల్ కోడ్ అమలులో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *