లోక్ సభ ఎన్నికల చివరి పోలింగ్ సమయంతో బిజెపిబోపాల్ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ టాకూర్ మహాత్మాగాంధీ హంతకుడి మీద చేసిన వ్యాఖ్యలు నష్టం కలిగిస్తుందని భారతీయ జనతా పార్టీ అనుకుట్లుంది.
ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా స్పందించారు
ఈ రోజు మధ్య ప్రదేశ్ లోని ఖర్గోన్ లో ఎన్నికల చివరి ర్యాలీల ప్రసంగించిన తర్వాత టివిచానెళ్లతో మాట్లాడుతూ మహాత్మాగాంధీన హత్య చేసిన నాధూరాం గాడ్సే ని దేశభక్తుడని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తప్పు అని ప్రధాని అన్నారు.
తమిళనటుడు కమల్ హాసన్ స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువు, ఆయన పేరు నాథూరామ్ గాడ్సే అన్నదాని మీద స్సందిస్తూ ప్రజ్ఞాసింగ్ నాధూరామ్ నువెనకేసుకువచ్చారు, ఆయన దేశభక్తుడన్నారు. గాడ్సే తిట్టిన వాళ్లకి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణ పాఠం చెబుతారని అన్నారు.
అనంతరం కర్నాటక ఎంపి నళిన్ కుమార్ కటీల్, కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డే కూడా ఆమె వ్యాఖ్యలను సమర్థించారు. ఈ ధోరణి బిజెపికి ఠారెత్తించింది. వెంటనే ప్రధాని రంగంలోకి దిగారు. మహాత్మాగాంధీని అవమానించిన వారికి క్షమించేది లేదని అన్నారు.
‘నాథూరామ్ గాడ్సేకి దేశభక్తుడని ప్రశంసిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాగా చెడ్డగా ఉన్నాయి. సమాజానికి అంతమంచివి కాదు. ఆమె క్షమాపణ కోరింది.అయితే నేనెపుడూ ఆమె క్షమించలేను,’అని ప్రధాని అన్నారు.
అంతకుముందు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కూడా స్పందించారు. మహాత్మాగాంధీ హంతకుడి మీద చేరసిన వ్యాఖ్యలమీద,వాటి ని బలపర్చిన వారి మీద క్రమశిక్షణా చర్య తీసుకుంటామని, అవి పార్టీ మర్యాదకు తగ్గట్టుగాలేవని అన్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ పది రోజుల్లో దీని మీద నివేదిక ఇస్తుందని అన్నారు.