మోహన్ బాబు అసలు పేరు తెలుసా?

టాలీవుడ్ లో మోహన్ బాబు నటనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన వినూత్న నటనాసరళి, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల మన్నన పొందారు. ఆయనకు డైలాగ్ కింగ్ అనే బిరుదు కూడా ఉంది.

హీరోగా, విలన్ గా విభిన్న పాత్రల్లో నటించి వెండితెరపై మంచి స్థానం సంపాదించుకున్నారు. అలనాటి అగ్ర హీరోల నుండి, నిన్నటి హీరోల వరకు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు మోహన్ బాబు. ప్రస్తుతం ఆయన వారసులుగా విష్ణు, మనోజ్, లక్ష్మి నటనను కొనసాగిస్తున్నారు.

చాలామందికి ఆయన మోహన్ బాబుగానే తెలుసు. కానీ ఆయన అసలు పేరు అది కాదు. ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు భక్తవత్సలం నాయుడు. మోహన్ బాబు తల్లిదండ్రులకు చాలాకాలం వరకు సంతానం కలగలేదు. దీంతో శ్రీకాళహస్తికి 14 కి.మీ దూరంలో కొండపైన ఉన్న బత్తినయ్య స్వామికి మొక్కుకున్నారట.

బత్తినయ్య స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీ ఫోటో

ఆయన వరంతోనే పుట్టారని నమ్మకంతో భక్తవత్సలం నాయుడు అని నామకరణం చేశారట మోహన్ బాబుకి తన తల్లిదండ్రులు. సినిమాలోకి వచ్చాక దాసరి నారాయణ రావు తనకు మోహన్ బాబు అని పేరు మార్చారని స్వయంగా మోహన్ బాబు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *