Home News కాలినడకన రెండు గంటల్లోనే తిరుమల కొండెక్కిన సమంత

కాలినడకన రెండు గంటల్లోనే తిరుమల కొండెక్కిన సమంత

119
0
SHARE

సమంత,నాగచైతన్య నటించిన చిత్రం మజిలి ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాయూనిట్ అంతా కలిసి తిరుమలకి వెళ్లారు. సమంతతో పాటు చిత్ర బృందంలోని కొందరు సభ్యులు కాలినడకన అలిపిరి నుండి తిరుమల కొండెక్కారు. రెండు గంటల్లోనే సమంత తిరుమలకు కాలినడకన చేరుకున్నారు.

సామాన్య భక్తులతో కలిసి కొండెక్కిన ఆమె మధ్య మధ్యలో అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు. నాగ చైతన్య, బ్రహ్మానందం కారులోనే తిరుమలకు చేరుకున్నారు. ఆ తర్వాత సమంత తన భర్త నాగచైతన్య, చిత్ర యూనిట్ తో కలిసి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. సమంత చాలా చలాకీగా, సామాన్య భక్తులతో కలుపుగోలుగా వ్యవహరించింది.