Home Entertainment ‘‘మహర్షి’’ ప్రయాణం పర్వాలేదు (మూవీ రివ్యూ)

‘‘మహర్షి’’ ప్రయాణం పర్వాలేదు (మూవీ రివ్యూ)

214
0
SHARE

 

చిత్రం :  ‘మహర్షి’

దర్శకత్వం : వంశీ పైడిపల్లి
తారాగణం : మహేష్ బాబు, పూజా హెగ్డే, జయసుధ, అల్లరి నరేష్,  జగపతి బాబు, రావురమేష్, ప్రకాష్ రాజ్, పోసాని, వెన్నెల కిశోర్ తదితరులు
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం :
బ్యానర్స్ : శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా
నిర్మాతలు : దిల్ రాజు, సి/ అశ్వనీ దత్, పొట్లూరి ప్రసాద్
విడుదల : మే 9, 2019
2.75 / 5

మూడు గంటల పాటు సాగిన ప్రయాణం అక్కడక్కడ నత్తనడక నడిచినా, చివర్లో కాస్తంత వేగం పుంజుకొని పర్వాలేదు అనిపించే స్థాయికి సినిమాను తీసుకెళ్లడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి, మహేష్ బాబు కొంతవరకు విజయం సాధించినట్లే! సినిమాను మరి కొంత “ట్రిమ్” చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తే అది దర్శకుడు పాటల మీద, అనవసరపు సన్నివేశాల మీద ఆధారపడటం వల్ల కలిగే అభిప్రాయం.

సినిమా మొదటి భాగంలో  చాలా వరకు ట్రిమ్ చేసి ఉండొచ్చు. అలా చేయకపోవడం వల్ల సినిమా వేగం తగ్గింది. సరి కొత్త లుక్ లో మహేష్ బాబు ఈ సినిమాను ఎప్పట్లాగే తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. “గమ్యం” సినిమా తర్వాత అల్లరి నరేష్ కు ఒక మంచి పాత్ర దొరికింది. బాగానే చేసాడు. ఇక రావు రమేష్ కు ఇటువంటి పాత్రలు నల్లేరు మీద నడకే! అక్కడక్కడా తనికెళ్ళ భరణి, సాయి కుమార్ లు మెరిశారు.  ప్రకాష్ రాజ్ నిడివి తక్కువున్నా పాత్రలో కనిపించినా తన ముద్రను వేశాడు.  జయసుధ కూడా తనదైన శైలిలో నటించింది. మొదటి భాగంలో మహేష్ బాబు లుక్, సన్నివేశాల చిత్రీకరణ యూత్ కు బాగా కనెక్ట్ అవుతాయి. సినిమాను హిట్ దిశగా తీసుకెళ్తాయి అయితే దర్శకుడి ప్రతిభ ను తక్కువగా అంచనా వేయలేం. కొన్ని సన్నివేశాలు, సంభాషణలు సినిమా స్థాయిని పెంచాయి కానీ వేగాన్ని మాత్రం కాదు. సినిమాకు ఉపయోగ పడిన అంశాల్లో సంగీతం, ఫోటోగ్రఫీ ఉన్నాయి. ఈ సినిమా మొత్తానికి బలం చివరి అరగంట మాత్రమే.

అలా అని మొదటి భాగం బాలేదని కాదు. నత్తనడక వల్ల అలా అనిపిస్తుంది. సినిమా మొత్తంలో అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు, మహేష్ బాబు లోని నటుణ్ని బయటకు తీసాయి. ప్రస్తుతం మన దేశాన్ని మన రాష్ట్రా లను వేధిస్తున్న ఒక సామాజిక సమస్య ని సినిమాటిక్ గా చూపించటం, దాన్ని  విజయవంతం చేయడం అంత సులభమైన విషయం కాదు. అయితే ఈ సినిమాలో దర్శకుడు చేసిన ఆ కృషి మెచ్చుకోదగ్గ స్థాయిలోనే ఉంది. ఇలాంటి సినిమాల్లో హీరోయిన్ పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి, పూజా హెగ్డే ఏమీ చేయలేదు. పాటలు కొంత  అందంగా చిత్రీకరించడానికి ఆమె ఉపయోగపడింది. దర్శకుడు ప్రతిభావంతుడు అయినప్పటికీ డ్రైవర్ గా మహర్షి జర్నీ ని ఓ స్థాయిలో తీసుకోలేక పోయాడు. దానికి కారణం స్క్రీన్ ప్లేలో ఉన్న లోపాలు.

ముందే చెప్పినట్లు చివర్లో బిగువుగా అల్లుకున్న సన్నివేశాలు, ఆలోచింపజేసే సంభాషణలు వంటి వాటి వల్ల సినిమా విజయవంతం అయ్యే అవకాశాలు పెంచుకుంది. సినిమాలు చర్చించిన సామాజిక సమస్య చాలా పెద్దది. దాన్ని చర్చించడానికి చిత్రీకరించడానికి సినిమా కాన్వాస్ చాలా చిన్నది. ఈ సినిమాలో “శ్రీమంతుడు” పోలికలు కనబడినప్పటికీ చాలా మటుకు తనదైన శైలిలోనే ముందుకు వెళ్లడం వల్ల పర్వాలే ని స్థాయి నుంచి మెరుగైన స్థాయికి వెళ్లింది. ఇక మహేష్ బాబు గురించి చెప్పేదేముంది, కొన్ని సన్నివేశాల్లో మంచి నటన ప్రవేశించే అవకాశం కలిగింది. చాలా సన్నివేశాలు సినిమాటిక్ గా ఉన్నప్పటికీ, అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద  “మహర్షి” సినిమా ఓ మోస్తారు హిట్ సినిమా గా మారితే ఆశ్చర్యమేమీ లేదు

-సిఎస్ సలీమ్ బాష