( శివశంకర్ హళహర్వి బెంగుళూర్ నుంచి )
లోక్ సభ ఎన్నికల్ల భారతీయ జనతా పార్టీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసేంత మెజారిటీ రాదని, రానున్నది హంగ్ పార్లమెంటని టిఆర్ ఎస్ విశ్వసిస్తూ ఉంది.
ఈ విషయాన్ని కెటిఆర్ తో పాటు పలువురు టిఆర్ ఎస్ నేతలు అపుడపుడూ వెల్లడిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో 15 సీట్లకు తక్కువ కాకుండా పార్లమెంటులో ఎంటరవుతామని ధీమాతో ఉన్న టిఆర్ ఎస్ పార్టీ వ్యూహమేమిటి? ఈ వూహ్యం గురించి నిర్ణయించేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫెడరల్ ప్రంటు యాత్రలుచేస్తున్నారు.
పరిస్థితులు అనుకూలిస్తే కాంగ్రెసేతర బిజెపి యేతర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం, లేదంటే కాంగ్రెస్ దగ్గిరవడం… అనేవి ఆయన అప్షన్లని మీడియా రాస్తున్నది.
ముఖ్యంగా బెంగుళూరు మీడియా ఒక అసక్తికరమయిన కథనం ప్రచురించింది.
కేంద్రంలో బిజెపి వచ్చే అవకాశాలు లేనందున వచ్చే కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంది. ఒక వేళ అదేజరిగితే, కెసియార్ పాత్ర ఏమిటి? కెసియార్ ఎలా ఉంటారు?
ఇపుడయితే జనమంతా ఆయని బిజెపి మనిషనే నమ్ముతున్నారు. ప్రతిపక్షాలు ఆయనని బిజెపి బి టీమ్ అనే చెబుతున్నాయి. ఈ కారణంచేతనే ఆయనను కలుసుకుని రాజకీయాలు మాట్లాడేందుకు తమిళనాడు డిఎంకె నేత స్టాలిన్ విముఖంగా ఉన్కారని చెబుతున్నారు.
అయితే, బెంగుళూరు వినవస్తున్న కథనం భిన్నంగా ఉంది. ఈ కథనం ప్రకారం కెసిఆర్ పొలిటిక్ ప్లాన్ మారింది. చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ కు దగ్గిరవాలనుకుంటున్నట్లు, ఈ విషయం సోమవారం నాడు ముఖ్యమంత్రి కుమారస్వామితో ఫోన్ లో మాట్లాడినపుడు కూడా ప్రస్తావనకువచ్చినట్లు కుమార స్వామి సన్నిహితులు చెప్పినట్లు న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక సంచలన వార్త రాసింది.
‘‘ కాంగ్రెస్ తో కెసియార్ సంబంధాలు బాగా చెడిపోయాయి. అందువల్ల కాంగ్రెస్ ను నేరుగా ఆయన కాంటాక్ట్ చేయలేకపోతున్నారు. దానికి తోడు తెలంగాణలో ఆయన తీసుకున్న తీవ్ర కాంగ్రెస్ వైఖరి వల్ల,పార్టీతో మళ్లీ చేతులు కలిపేందుకు ప్రయత్నించడం కుదరదు. ప్రయత్నిస్తున్నారన్న విషయం బయటకు పొక్కడం బాగుండదు. అందువల్ల కాంగ్రెస్ తో రాజకీయానుబంధం ఉన్న జనతాదళ్ (ఎస్ ) కాంగ్రెస్-టిఆర్ ఎస్ లను మళ్లీ దగ్గరకుచేర్చగలదని కెసియార్ నముతున్నారు,’’ అని కుమార స్వామి, కెసియార్ టెలిఫోన్ సంభాషణ గురించి తెలిసిన వర్గాలు వెల్లడించాయని ఈ ఇండియన్ ఎక్స్ ప్రెస్ రాసింది.
జెడి(ఎస్ ) ఇప్పటికే కాంగ్రెస్ తో కూటమి కట్టింది. దీని వల్ల లబ్దిపొందింది. అందువల్ల ఈ పార్టీని కాంగ్రెస్ కు దూరం చేయాలనుకోవడం వృధా ప్రయాస అవుతుందని కెసిఆర్ గమనించారని ఈపత్రిక రాసింది.
అందువల్ల తాను కాంగ్రెస్ తో ఇచ్చిపుచ్చుకునేందుకు (క్విడ్ ప్రొ క్వో) సిద్ధంగా ఉన్నవిషయాన్ని కాంగ్రెస్ కుచెప్పాలని కుమార స్వామిని ఒప్పించగలనని కెసిఆర్ నమ్ముతున్నట్లు ఈ పత్రిక రాసింది.