నెహ్రూ-షేక్ అబ్దుల్లా దాగుడు మూతలు, కాశ్మీర్ కుట్ర కేసు అంటే ఎమిటి?

వారం రోజులుగా దేశమంతా చర్చనీయాంశమయిన విషయం  కాశ్మీరే.
 గతంలో  జమ్ము కాశ్మీర్ కు ప్రత్యేక్ హోదా ఇస్తూ తెచ్చిన రాజ్యంగాంలోని అర్టికల్ 370, 35ఎ లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
అంతేకాదు, ఆ రాష్ట్రానికి ఉన్న రాష్ట్రం హోదా (Statehood)ని తీసేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది.
అంతేనా, కాదు, ఇంకాచాలా ఉంది. కాశ్మీర్ లో కాశ్మీరేతరులు ఆస్తిపాస్తులు కొనరాదన్న ఆంక్షలను కూడా దీనితో పాటే ఎత్తేసింది.
ఇపుడు భారతీయ పౌరుడెవరయినా అక్కడ భూములు కొనవచ్చు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయ వచ్చు.
ఈ చర్చ మధ్య కాశ్మీర్ వివాద చరిత్ర లోని ఒక ముఖ్యమయిన ఘట్టం గురించి తెలుసుకుందాం. అదే కాశ్మీర్ కుట్ర కేసు (Kashmir Conspiracy Case).
ఈ కేసును 1958లో బుక్ చేశారు. కోర్టు విచారణ 1959లో మొదలయింది. తర్వాత కేసులన్నీ ఉప సహరించుకున్నారు. అయితే, ఈ కాశ్మీర్ కుట్ర కేసు గురించి అవగాహన చేసుకుంటే కాశ్మీర్ వివాదానికి ఎక్కడ విత్తనాలు పడ్డాయో, ఎవరు వేశారో కూడా అర్థమవుతుంది.
ఇంతకీ కాశ్మీర్ కుట్ర కేసు అంటే ఏమిటి?
కాశ్మీర్ లో విచిత్రమయిన ప్రదేశం. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో ముస్లింలు అధికంగా ఉన్నా వారికి పాకిస్తాన్ ముస్లింలకు పోలిక లేదు. కాశ్మీర్ ముస్లింలు సెక్యులర్ స్వభావం ఉన్న వాళ్లు. దీనికి ఒక కారణం చాలా కాలం ఈ ప్రాంతం హిందూ రాజుల ఏలుబడిలో ఉండటం.  కాశ్మీర్ చివరి రాజు హరిసింగ్. ఆయన కుమారుడే డాక్టర్ కరణ్ సింగ్.
GOLD NEWS
నిన్న కొండెక్కిన బంగారు ధర ఈ రోజు ఒక మెట్టు దిగింది…
కాశ్మీర్ ముస్లిం సంప్రయదాన్ని కాశ్మీరియత్ అంటారు. అంటే సుఫీ విధానానికి దగ్గరగా ఉంటుంది.  స్వభావంలో ఇది అనేక విశ్వాసాలకు ఇందులో చోటుంటుంది.మమూలు ఇస్లాంలో ఇలాంటి ప్లూరలిజానికి చోటుండదు.
అందుకే 1947 అక్టోబర్ మహారాజ హరిసంగ్ జమ్ము కాశ్మీర్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయాలనుకున్నపుడు అక్కడ ముస్లిం పెద్దలు పెద్దగా వ్యతిరేకించలేదు.
ఎందుకంటే వాళ్లకి ఇస్లామిక్ పాకిస్తాన్ కంటే సెక్యులర్ భారతదేశమే మేలనిపించింది. అందుకే అక్కడి కాశ్మీరియత్ నాయకుడయిన షేక్ అబ్దుల్లా మహారాజ హిరిసింగ్ నిర్ణయాన్ని స్వాగతించాడు.
ఇండియాలో కలవాలో లేక పాకిస్తాన్ లో కలవాలాఅనే నిర్ణయానికి వచ్చేముందు, అంటే మహారాజా హరిసింగ్ నిర్ణయానికి మద్దతునిచ్చేముంందు, షేక్ అబ్దుల్లా తన దూతగా సాదిక్ అబ్దుల్లా అనే మరొక కాశ్మీర్ ముస్లింనాయకుడిని పాకిస్తాన్ పంపించి, ఆదేశం ఎలా ఉండబోతున్నదో కనుక్కుని కూడా రమ్మన్నారు.
సాదిక్ పాకిస్తాన్ వెళ్లి తిరిగొచ్చి ఆదేశం సెక్యులర్ గా కాకుండా ఇస్లామిక్ స్టేట్ గా ఉండాలని నిర్ణయించుకుందని చెప్పాడు.
దీనితో షేక్ అబ్దుల్లా రాజా హరిసింగ్ నిర్ణయాన్ని సమర్థించి కాశ్మీర్ ను భారత్ భూభాగం చేసేందుకు అంగకీరించారు.
1932లో షేక్ అబ్దుల్లా, చౌధ్రి గులామ్ అబ్బాస్ తో కలసి అల్ జమ్ము అండ్ కాశ్మీర్ ముస్లిం నేషనల్ కాన్ఫరెన్స్ (All Jammu and Kashmir Muslim Conference) అనే పార్టీని ఏర్పా టు చేశారు. ఇదే 1939లో నేషనల్ కాన్ఫరెన్స్ (NC) గా మారింది. రాజాహరిసింగ్ నిర్ణయాన్ని ముస్లింల పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ సమర్థించింది.
అజాద్ కాశ్మీర్
అయితే 1941లో గులామ్ అబ్బాస్ నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి విడిపోయి పాత పార్టీని అంటే ముస్లింకాన్ఫరెన్స్ ను పునరుద్ధరించాడు. అజాద్ కాశ్మీర్ నినాదంతో కొత్త ఉద్యమం ప్రారంభించాడు.
జవహర్ లాల్ నెహ్రూకు, షేక్ అబ్దుల్లాకు 1937 నుంచి స్నేహం ఉంది.
మొదట ఇది అబ్దుల్లా ఇండియా వైపు మొగ్గేందుకు బాగా దోహదపడింది. అయితే, స్వాతంత్య్రం వచ్చాక కాశ్మీర్ లో తనకు పెద్ద పీట వేయాలని కూడా అబ్దుల్లా భావిస్తూ వచ్చారు. ఇక భారతదశం స్వాతంత్య్రానికి దగ్గరగా జరుగుతున్నపుడు 1946లో షేక్ అబ్దుల్లా ‘క్విట్ కాశ్మీర్’ ఉద్యమం ప్రారంభించారు.
ఇది హరిసింగ్ కు వ్యతిరేకంగా లేవదీసిన ఉద్యమం. అపుడు కొద్ది రోజులు అబ్దుల్లాను జైలులో పెట్టాల్సి వచ్చింది. నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక అయన అబ్దుల్లాకు పూర్తి మద్దతు ప్రకటించారు. అబ్దుల్లాను జైలు నుంచి విడిపించేందుకు 1946 జూన్ లో కాశ్మీర్ కు కూడా వెళ్లారు.
తర్వాత 1947 అక్టోబర్ 26 న మహారాజ కాశ్మీర్ విలీనం ఒప్పదం (Instrument of Accession)మీద సంతకం చేశాడు. మరుసటిరోజే భారత సైన్యాలు శ్రీనగర్ లో ప్రవేశించాయి. అబ్దుల్లా ప్రయివేటు సైన్యాలు కూడా భారత సైన్యాలకు సహకరించాయి.
కాశ్మీర్ భారత్ లో చేరితో గొడవచేసేందుకు పాకిస్తాన్ భారీగా సాయుధ అల్లరి మూకలను పంపించింది. వీటన్నింటిని భారత సైన్యాలు తరిమేశాయి. అయితే కొంత కాశ్మీర్ భూభాగం పాక్తిస్తాన్ చేతిలోకి వెళ్లింది.
పూర్వీకుల ప్రాంతమయిన కాశ్మీర్ మీద నెహ్రూకు వల్లమాలిన ప్రేమ. అందుకే ఈ ఒక్క విషయాన్ని ఆయన తన దగ్గిర ఉంచుకున్నారు. హోమ్ మంత్రి అయినా వల్లభ్ బాయ పటేల్ కు అప్పగించలేదు.
తర్వాత కాశ్మీర్ కి కొద్ది రోజులు హరిసింగ్ రాజుగానే ఉండాలని, షేక్అబ్దుల్లా ప్రధానిగా ఉండాలన్న స్వత్రంత్ర ప్రతిపత్తి ఒప్పందం జరిగింది.
ఈ సమయంలో భారత్ కాశ్మీర్ ఎలా విలీనం కావాలనే దానిమీద హరిసింగ్ కు, షేక్ అబ్దుల్లాకు విబేధాలొచ్చాయి.
హరిసింగ్ బేషరతుగా విలీనమన్నారు. కాదు, ఇది తాత్కాలికమే, తుది నిర్ణయం తర్వాత నిదానంగా ప్రజలు తీసుకుంటారేే మెలిక పెట్టారు షేక్ అబ్దుల్లా.
ఈ మెలిక చూపిస్తూ  అబ్దుల్లా భారత ప్రభుత్వం నుంచి తన డిమాండ్లను నెరవేర్చుకోవడం మొదలు పెట్టారు.ఇలా  కాశ్మీర్ భారత్ లో పూర్తిగా విలీనం కావడాన్ని ఆయన పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఇలా బేరసారాలాడి ఆర్టికల్ 370, 35Aలను కూడా  సాధించుకున్నారు.
అబ్దుల్లాను వెనకేసుకుని వచ్చి తాను చేసిన తప్పేమిటో నెహ్రూకు 1953 నాటికి గాని అర్థం కాలేదు. అప్పటికే అబ్దుల్లా కొరకరాని కొయ్యగా మారాడు. భారత ప్రభుత్వాన్ని ప్రతిదానికి ఇబ్బందిపెడుతున్నాడు. భారత్ నుంచి తన డిమాండ్లను సాధించుకునేందుకు పాకిప్తాన్ కు దగ్గిరవుతున్నట్లు కూడా నటించే వాడు.
అబ్దుల్లా మరొక అజాదీ ఉద్యమం లేవదీసి భారత్ నుంచి విడియేందుకు కుట్ర చేస్తాడేమో ననే అనుమానం భారత ప్రభుత్వానికి వచ్చింది.
వెంటనే కాశ్మీర్ సదర్ ఇ రియాసత్  (Sadr-i-Riyasat:Constitutional Head of Kashmir) అయిన డాక్టర్ కరుణ్ సింగ్ 1953 ఆగస్టు 8న కాశ్మీర్ ప్రధానిగా షేక్ అబ్దుల్లాను క్యాబినెట్ లో ఆయన మద్దతు కోల్పోయాడనే కారణంతో డిస్మిస్ చేశారు.
ఉప ప్రధాని బక్షి గులామ్ ను ప్రధానిగా నియమించారు. ఆయనకు మెజారిటీ ప్రూప్ చేసుకునేందుకు కూడా అవకాశమీయలేదు. స్వతంత్ర కాశ్మీర్ కోసం కుట్ర చేస్తున్నారనే ఆరోపణతో వెంటనే ఆయన్ని అరెస్టు చేసి తమిళనాడులోని వూటీకి తరలించారు.
అక్కడ రెన్నెళ్లుంచి కొడైకెనాల్ కు తరలించారు. కొడైకెనాల్ శివారులోని కోహినూర్ బంగళాలో ఆయనను నిర్బంధించారు. అక్కడ ఆయన పదేళ్లున్నారు.
1958లో అబ్దుల్లాతో పాటు మరొక 23 మంది కుట్ర కేసు చార్జ్ షీట్ నమోదు చేశారు. ఇదే ఫేమస్ కాశ్మీర్ కుట్ర కేసు. దీని విచారణ 1959లో మొదలయింది.
స్నేహితుడయినా సరే జవహర్ లాల్ నెహ్రూ యే స్వయంగా షేక్ అబ్దుల్లాను అరెస్టు చేయించారని చెబుతారు.
1964 లో కాశ్మీర్ ప్రభుత్వం షేక్ అబ్దుల్లా మీద ఉన్న కాశ్మీర్ కుట్ర కేసును ఎత్తి వేసింది. ఆయన కొడైకెనాల్ నిర్బంధం నుంచి శ్రీనగర్ రాగానే బ్రహ్మండమయిన స్వాగతం లభించింది.
తర్వాత నెహ్రూ అబ్దుల్లా మళ్లీ దగ్గరయ్యారు. కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇండియా పాకిస్తాన్ కు మధ్య వర్తిగా కూడా సనిచేసేందుకు కూడా ఒప్పుకున్నారు.
అయితే, నెహ్రూ అనంతరం ఇందిరాగాంధీ హయాంలో 1971లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగి, బంగ్లాదేశ్ ఏర్పడ్డాక,ఇండియాతో గొడవపెట్టుకుంటే కష్టమని అబ్దుల్లా భావించాడు.
అప్పటి ప్రధాని ఇందిరా గాంధీలో చర్చలు ప్రారంభించాడు. ఎన్నికల్లో కాశ్మీర్ ముఖ్యమంత్రిగా గెలుపొందారు. 1982 దాకా ఈ పదవిలో కొనసాగారు.
అయితే, కాశ్మీర్ సమస్యను జవహర్ లాల్ నెహ్రూ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని, ఆయన షేక్ అబ్దుల్లాతో ఆడిన దాగుడు మూతల వల్లే అక్కడి ముస్లింలలో  భారత ప్రభుత్వం మీద విశ్వాసం పోయిందనే విమర్శ వచ్చింది.

https://trendingtelugunews.com/tiruma-annual-brahmotsavas-arrangement-in-full-swing/