Home English ఢిల్లీ రాజకీయాల సూపర్ స్టార్ అరుణ్ జైట్లీ

ఢిల్లీ రాజకీయాల సూపర్ స్టార్ అరుణ్ జైట్లీ

61
0
SHARE
నరేంద్ర మోదీని 2001లో గుజరాత్ అసైన్ మెంటు మీద పంపడంలో కీలకపాత్ర వహించి సరికొత్త బిజెపి అవిర్భవానికి బాట వేసిన  బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ (1952-2019) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు.
2014 లో బిజెపి  గెలుపొందాక కొత్తగా ఢిల్లీకి వచ్చిన నరేంద్ర మోదీకి, అమిత్ షాకు ఢిల్లీ కళ్లు చెవులై పనిచేసి వారికి గైడెన్స్ ఇచ్చింది జైట్లీయే నని చెబుతారు. మోదీ-షాల గుజరాత్ మోడన్ ను ఢిల్లీ నుంచి జాతీయ రాజకీయాల్లోక తర్జుమా చేసి వాడు జైట్లీయే.
ఆ మధ్య ఆయనకు కిడ్నీమార్పిడి కూడా జరిగింది. కొద్దిరోజులు విదేశాలలో కూడా ఆయన చికిత్స పొందారు. దేశానికి తిరగొచ్చాక కూడా ఆయన సమస్య పరిష్కారం కాలేదు. పరిస్థితి విషమిస్తూ ఉండటంతో ఈ నెల 9న ఆయన న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. అయినా ఆయన పరిస్థితి విషమించింది. ఈనెల 20వ తేదీ నుంచి వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ మధ్యాహ్నం ఆయన చనిపోయినట్లు ఎయిమ్స్ బులెటిన్ విడుదల చేసింది.
మాడరన్ బిజెపితో పాటు ఆయన మెట్టు మెట్టు ఎదుగుతూ వచ్చారు. గెలుపులోను ఓటమిలోను భారతీయ జనతా పార్టీకి అధికార ప్రతినిధిగా ఆయన సాటిలేని వక్త అయ్యారు. భారతీయ జనతా పార్టీ వ్యూహకర్తలలో ముఖ్యలాయన. ఢిల్లీ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర వహించారు. అందుకే బిజెపి మంత్రి వర్గమేదయినా సరే ఆయనకు పదవి తప్పనిసరిగా ఉండేది. ప్రధాని వాజ్ పేయి అయినా, మోదీ అయిన మంత్రి వర్గంలో ఆయన తప్పన సరి ముఖమయ్యారు. మోదీ.20.0లో మాత్రమే ఆయన కనిపించలేదు. అనారోగ్యం కారణంగా ఆయన పార్టీ, ప్రభుత్వం భౌతిక బాధ్యత తలనుంచి దూరమయ్యారు. అయితే, ఆయన సోషల్ మీడియాలో పార్టీని, ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూనే వస్తున్నారు.
అరుణ్ జైట్లీ 1952, నవంబర్‌ 28న ఢిల్లీలో జన్మించారు. ఆయన కుటుంబం దేశ విభజనసమయంలో పాకిస్తాన్ నుంచి వయా అమృత సర్ ఢిల్లీకి వచ్చింది. ఇదంతా ఆయన పుట్టడానికి ముందే జరిగింది.    ఆయనకు భార్య సంగీత, కుమారుడు రోహన్‌, కూతురు సోనాలీ ఉన్నారు. ఆయన విద్యాభ్యాసం శ్రీరామ్ కాలేజ్ ఆప్ కామర్స్ లోనూ తర్వత లా కాలేజీలోను సాగింది.
ఢిల్లీ వర్సిటీలో విద్యార్థి సంఘం రాజకీయాలనుంచి ఆయన 1991లో మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లోకి వచ్చారు. 1974లో డియు విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎబివిపి తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థని ఓడించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఢిల్లీ యూనివర్శిటీ రాజకీయాల వల్లే ఆయన 1975లో ఎమర్జన్సీ విధించినపుడు అరెస్టయ్యారు. ఇందిరా గాంధీ విధించిన  ఎమర్జన్సీ విధించినపుడు ఢిల్లీలో మొదటి ప్రదర్శనకు కేంద్రమయింది ఢిల్లీ విశ్వవిద్యాలయమే. యూనియన్ చెయిర్మన్ గా ఉన్న జైట్లీ జూన్ 26న నిరసన ప్రదర్శన జరిపారు.   అంతే అరెస్టయ్యారు. ఎమర్జన్సీ కాలంలో అంబాల, తీహార్ జైళ్లలో ఉన్నారు. ఎమర్జన్సీ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాక ఆయన ఎబివిపి ఆల్ ఇండియా  కార్యదర్శి అయ్యారు.
ఆయన లోని నాయకత్వ లక్షణాలు 1977లోనే బయపడ్డాయి. జనతా పార్టీ తరఫున క్యాంపెయిన్ నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన లోక్ తాంత్రిక్ యువ మోర్చాకు ఆయన జాతీయ కన్వనర్ గా ఉన్నపుడు ఆయన మంచి పేరొచ్చింది.
ఆయన విపి సింగ్ కు బాగా సన్నిహితుడిగా జైట్లీ ఉండే వారు. ఈ సాన్నిహిత్యం వల్లే 1989లో విపి సింగ్ ప్రధాని గా ఉన్నపుడు జైట్లీ అడిషనల్ సాలిసిటర్ జనరల్ గా నియమితులయ్యారు. ఆయన బిజెపి మద్థతు ప్రకటించింది. బోఫోర్స్ కేసులో ఆయన రాజీవ్ కు వ్యతిరేకంగా వాదించారు.
ఆయన రెండు సార్లు క్రికెట్ కంట్రోల్ బోర్డు వైస్ ఛెయిర్మన్గా, ఒకసారి ఢిల్లీ క్రికెట్ బోర్డు అధ్యక్షుగా ఉన్నారు.
1995-200ల మధ్య జైట్లీకి నరేంద్రమోదీతో సాన్నిహిత్యం పెరిగింది. అపుడు మోదీ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. 2001లొ గుజరాత్ బిజెపిలో నాయకత్వ సమస్య వచ్చినపుడు నరేంద్ర మోదీ పంపడంలో కీలకపాత్ర పోషించింది అరుణ్ జైట్లీయే. ఈ విషయంలో జైట్లీ అద్వానీని వప్పించగలిగారు.
2001లో గుజరాత్లో భారీ భూకంపంవచ్చింది. దాదాపు 20 వేల మందిచనిపోయారు. అపుడు ముఖ్యమంత్రి కేశూబాయ్ పటేల్. ఆయన్నితక్షణం మార్చాలనుకున్నారు. అపుడు ఎవరు ఆయన వారసుడనే ప్రశ్న తలెత్తింది. అపుడు బిజెపి ప్రధానకార్యదర్శిగా నరేంద్రమోదీని పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదన చేసింది అపుడు కేంద్రంలో మంత్రిగా ఉంటూ అద్వానీ ,వాజ్ పేయీలిద్దరికి సన్నిహితంగా ఉన్న జైట్లీయేనని అప్పటి విషయాలను దగ్గరి నుంచి గమనించిన వాళ్లు చెబుతున్నారు. 2001 అక్టోబర్ 7 మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఆతర్వాత మోదీ-జైట్లీల స్నేహం బలపడింది. మోదీకి ప్రధాన మద్దతు దారు (defender-in-chief)గా మారిపోయారు.
వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్ డిఎ  మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. వాజ్ పేయి ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్, కామర్స్అండ్ ఇండస్ట్రీ, లా అండ్ జస్టిస్ మంత్రిగా పనిచేశారు. రాజ్యసభలో బిజెపిప్రతిపక్ష నాయకుడి గా ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో జైట్లీ తొలుత రక్షణ శాఖ, ఆ తరువాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జైట్లీ హయాంలోనే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి సంస్కరణలను కేంద్రం తీసుకొచ్చింది.2014 లోక్‌సభ ఎన్నికలలో అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.ఈ నిర్ణయాలను ఆయన సమర్థవంతంగా సమర్థించారు. విమర్శలను తిప్పికొట్టారు. సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయాలన్నది ఆయన ఆలోచనే. 2014 ఎన్నికల్లో బిజెపి అఖండ విజయానికి వ్యవూరచన చేసిన వాళ్లలో జైట్లీ ఒకరు. అయితే గత పదేళ్లుగా ఆయన ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ వస్తున్నారు. 2014 బేరియాట్రిక్ సర్జరీ జరిగింది. 2018లో కిడ్నీ మార్పిడి జరిగింది.
గత మూడేళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. . అమెరికాలోనూ దీర్ఘకాలంపాటు చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు.
అయితే పార్టీ ఆయనను రాజ్యసభ కు నామినేట్ చేసింది.