Home Telugu జగన్ సిఎంవొ టీమ్ ఇదే…

జగన్ సిఎంవొ టీమ్ ఇదే…

133
0
SHARE
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవొ) ఇక పూర్టి స్థాయిల్ పని చేస్తుంది. జగన్ వ్యక్తిగత టీం సిద్ధమయింది. పరిపాలనా దక్షులు, మచ్చలేని అధికారులను ఆయన ఎంపిక చేసుకున్నారు.  వారికి విధులను కేటాయించారు.
సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న  ముఖ్య సలహాదారు మాజీ రాష్ట్ర  అజేయకల్లంతో పాటు ఇతర అధికారులందరికి బరువు బాధ్యతలు కేటాయించారు.
అజేయ కల్లం, సీఎం ముఖ్య సలహాదారుగా ఆయన  సాధారణ పరిపాలన, హోంశాఖ, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ, శాంతిభద్రతల అంశాలు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యకలాపాలు పర్యవేక్షిస్తారు.
సీనియర్ ఐఎఎస్ అధికారి పీవీ రమేష్, సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ గా ఉంటారు. ఆయనకు
వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, విద్యాశాఖ(పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్య), పరిశ్రమలు,వాణిజ్యం, మౌళిక వసతులు, పెట్టుబడులు,ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ, ఇన్‌ఫ్రా, ఇంధన శాఖ  సమన్వయ బాధ్యతలను కేటాయించారు.
మరొక అధికారి సొల్మన్‌ ఆరోక్య రాజ్, సీఎం కార్యదర్శి నియమితులయ్యారు. ట్రాన్స్‌పోర్ట్‌ రహదారులు, భవనాల శాఖ, ఏపీఎస్‌ఆర్టీసీ, గృహ నిర్మాణం, ఆహార,పౌరసరఫరాల, వినియోగదారుల సమస్యలు, పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి, సెర్ప్, అన్ని సంక్షేమ శాఖలు, యువజన వ్యవహారాలు, క్రీడలు.
పాలనాదక్షుడిగా పేరున్న మరొక ఐఎఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి, సీఎం అదనపు కార్యదర్శి గా ఉంటారు. ఆయన నీటి వనరులు, పర్యావరణం, అటవీ,సాంకేతిక, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, అర్బన్‌ డెవలప్‌మెంట్, సీఆర్‌డీఏ, వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, పర్యాటకంలను చూస్తారు.
జె.మురళి, సీఎం అదనపు కార్యదర్శి. ఆయన పశుసంవర్థక, పాడి పరిశ్రమ,మత్స్యశాఖ, సహకారం, సంస్కృతులకు సమన్వయ కర్తగా ఉంటారు.
డాక్టర్‌ ముక్తాపురం హరికృష్ణ, సీఎం ప్రత్యేక అధికారి. ఆరోగ్య శ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌), విజ్ఞాపనలు(ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజల విజ్ఞప్తులు) చూస్తారు.
పి.కృష్ణమోహన్‌రెడ్డి, ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ).ముఖ్యమంత్రికి సంబంధించిన మినిట్‌ టు మినిట్‌ ప్రోగ్రామ్, అపాయింట్‌మెంట్స్, విజిటర్స్‌ అపాయింట్‌మెంట్స్‌ ఈయన బాధ్యత.