జీవితా రాజశేఖర్ వ్యవహారంలో సంధ్యకు మద్దతు

తమ పిచ్చి పిచ్చి భాష, హావభావ విన్యాసాలతో, పార్టీలు మార్చే కుప్పిగంతులతో మనల్ని విపరీతంగా నవ్వించే జీవిత-కాలపు జో-ఖర్లలో ఒకరు సంధ్య(Pow)సంధ్య మీద కేసు పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నది.
సంధ్య రాజ్యానికే భయపడదు. ఇటువంటి జోకర్లను చాలామందిని చూసింది తను. స్త్రీల పాలిట పాములపుట్ట వంటి సినిమారంగంలో ప్రమాదకర పాముల కోరలు పీకే సంధ్య వంటి వారు పాముల నరసయ్యలే. అందుకే సంధ్య వంటి వారంటే కోపం, భయం కూడా! సంధ్యకి మద్దతు పెరుగుతున్నది. సంధ్యకి మద్దతుగా మహిళా యాక్టివిస్టులు, రచయిత్రుల ప్రకటననని పూర్తిగా సమర్ధిస్తున్నాను. నా మిత్రులందరూ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను.

” 23 ఏప్రిల్ 2018 మహిళా, ప్రజా ఉద్యమ నాయకురాలు POW సంధ్య పై సినీనటి జీవిత చేసిన ఆరోపణలని ఖండిస్తూ మహిళా సంఘాలు, మేధావులు, రచయిత్రులు, కళాకారులు, కార్యకర్తల పత్రికా ప్రకటన
సినిమా అంటే వినోదం, విఙ్ఞానం అనే మాటకు ఎప్పుడో కాలం చెల్లింది. ఇప్పుడంతా కాసుల కోసం వేట మాత్రమే ఇక్కడ నడుస్తోంది. లింగ వివక్షత, లైంగిక, ఆర్థిక దోపిడే ఇక్కడ జరుగుతోంది. పితృస్వామ్య భావజాలానికి పరాకాష్ట అయిన ఇలాంటి వ్యవస్థలో మానవతా విలువలకు స్థానమెక్కడుంటుంది? ఈ రంగంలోకి రావాలనుకునే అతివలకు, ట్రాన్స్ జెండర్ లకు గౌరవం, భద్రత, ఆదాయం, ఆరోగ్యం, హక్కులు ఎక్కుడుంటాయి? అదే కదా శ్రీరెడ్డి అడిగింది. అదే కదా మిగతా ఆర్టిస్టులు కడుపుచించుకుని, కన్నీళ్ల పర్యంతమవుతూ చెప్పింది. తమని కళాకారులుగా గుర్తించండి. తమకి కూడా వెండితెర మీద కనిపించే అవకాశాలివ్వండి. తమ కడుపులు కొట్టకండి. తమ శరీరాలను పశువాంచలకు బలిచేయకండి. ఇదే కదా వారు అడిగింది.
శ్రీరెడ్డి ప్రశ్న అనేక ముసుగుల్ని చించేసింది. ఒక మౌనాన్ని బద్ధలు చేసింది. ప్రశ్న ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. ప్రశ్న ఎప్పుడూ నగ్నంగానే ఉంటుంది. ప్రశ్న ఎప్పుడూ ఆగ్రహంగానే ఉంటుంది. ప్రశ్న ఎప్పుడూ దు:ఖంతో నిండే ఉంటుంది. ప్రశ్న ఎప్పుడూ బెదిరింపులకు లోనవుతుంది. అదే ఇప్పుడూ పునారవృతమవుతోంది.
స్త్రీలను అంగాంగ ప్రదర్శనలు, అర్థనగ్న దృశ్యాలు, ద్వందర్థాల మాటలు, పాటలకి, పడకగదికే పనికొచ్చే బొమ్మలుగా చూపిస్తున్న తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ’క్యాస్టింగ్ కౌచ్‘ గురించి, ఇటీవల జరిగిన సంఘటనలు, కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో బాధిత మహిళలకు అండగా అనేక మహిళా సంఘాలు ముందుకొచ్చి నిలబడ్డాయి. వారి కన్నీటి ఘోష విన్నాయి. తెలుగు సినీరంగంలో జరుగుతున్న లైంగిక, ఆర్థిక దోపిడి మీద చర్చలు చేపట్టాయి. వినతి పత్రాలు సమర్పించాయి. లైంగిక, ఆర్థిక దోపిడిని నివారించాలని నినదిస్తున్నాయి.
క్యాస్టింగ్ కౌచ్ పై చర్చలు ఇంత తీవ్రమయ్యాకే, సమస్య తీవ్రత అర్థమయ్యాకే తెలుగుసినీపరిశ్రమలో లైంగిక వేధింపుల నిరోధిక కమిటి (కాష్ కమిటి) ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం జరిగింది. ఇది ఆహ్వానించదగిన పరిణామమే. అయితే, అదే సమయంలో ఈ కమిటీకి ఛైర్ పర్సన్ గా జీవిత రాజశేఖర్ పేరు వినిపించింది. ఈ అంశంపై ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య అభ్యంతరం వ్యక్తం చేసారు. అసలు సినిమారంగంలో క్యాస్టింగ్ కౌచ్ లేదని. కాష్ కమిటీ అవసరమే లేదన్న వ్యక్తిని చైర్ పర్సన్ గా ఎలా నియమిస్తారనే ప్రశ్నని సంధ్య లేవనెత్తారు.

సంధ్య (యూ ట్యూబ్ నుంచి)

ఇదే విషయంపై ప్రెస్ మీట్ పట్టిన జీవితా రాజశేఖర్, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య మీద తీవ్రమైన పదజాలంతో పాటు, వ్యక్తిగతమైన అంశాలను కించపరిచేవిధంగా మాట్లాడటమే కాకుండా, విలేఖరులు కనిపించినపుడల్లా సంధ్య మీద దూషణలకు దిగటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. మహిళా, ప్రజా ఉద్యమ నాయకురాలు ఫోవ్ సంధ్య పై జీవితా రాజశేఖర్ చేస్తున్న అసత్య ఆరోపణలను నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం లోని ప్రముఖ మహిళా ఉద్యమ నాయకురాళ్ళలో సంధ్య పేరు ముందు వరుసలో ఉంటుంది. నిరంతరం బాధితమహిళలకు అండగా ఉంటూ, వారి సమస్యలకు పరిష్కాలను చూపిస్తూ, మూడున్నర దశాబ్దాలుగా మహిళాఉద్యమాలతో మమేకమై పనిచేస్తోంది. అనేక ఉద్యమాల్లో ముందువరుసలో ఉంటుంది.
ఇదే తెలుగు సినిమా రంగంలో, పెద్దమనుషులుగా చెప్పుకుంటున్న అనేక మంది తమ ఆడపిల్లలకి సమస్యలెదురైతే వచ్చి సలహా తీసుకునేది కూడా సంధ్య ని ఇతర మహిళా సంఘాల నేతలనే.
ఇదే వాస్తవం. నిజానికి ఈ రోజు ’క్యాస్టింగ్ కౌచ్‘ గురించి గొంతెత్తిన వారు కూడా తమ సమస్యల పరిష్కారానికి మహిళా సంఘాల దగ్గరికే వచ్చారు కానీ, పరిశ్రమలో ఎప్పటినుంచో వున్న జీవిత గారి దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు? ఈ విషయాన్ని జీవిత గారు ఇకనైనా అర్థం చేసుకుని తన ధోరణి మార్చుకోవాలి.
ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య మీద జీవితా రాజశేఖర్ చేసిన దుర్మార్గమైన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా ఉద్యమాలలో ముందుండి నాయకత్వం వహిస్తున్న సంధ్య కు మేమంతా ఏకగ్రీవంగా మద్ధతు తెలియచేస్తున్నాం. సంధ్య పై చేసిన ఫిర్యాదులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఈ కింద సంతకం చేసిన 100 మందిమి డిమాండ్ చేస్తున్నాం.

ప్రకటన చేసిన వారు:

ప్రొఫెసర్ రమ మేల్కోటె, ప్రొఫెసర్ సూసీ తరు, డాక్టర్ లలిత, డాక్టర్ వీణ శత్రుజ్ఞ, దేవి, ఝాన్సీ, సజయ, సుమిత్ర , స్వప్న, కొండవీటి సత్యవతి , విజయ భండారు, సృజన, ఆశ, వసుధ, తేజస్విని, ఏ. సునీత, సూరేపల్లి సుజాత, రచన ముద్రబోయిన, విమల మోర్తల, గీత రామస్వామి, ఆర్. అఖిలేశ్వరి, ఉమా బృగుబండ, సి .వనజ, చంద్రముఖి, పద్మ వంగపల్లి, వైజయంతి వసంత మొగిలి, ఖలిద పర్వీన్, కనీజ్ ఫాతిమా, శేఫాలి ఝా, సన వహాబ్, మల్లీశ్వరి, అస్మా రషీద్, నిఖత్ ఫాతిమా, బిఎన్ రత్న, సూర్య కుమారి, స్వేచ్చ, కాత్యాయనీ విద్మహే, జ్యోతి వడ్లమూడి, సత్యవతి, జస్వీన్ జైరత్, కవిత కట్ట, సిస్టర్ లిజి, ఆశలత, పి. హేమ, సుధా గోపరాజు, ఉష సీతాలక్ష్మి, పద్మజ షా, అపూర్వ, మధుమిత సిన్హా, క్రాంతి, కళావతి, సావిత్రి, ఆర్. ఇందిర, రెహాన, కల్పనా దయాల, సోనియా ఆకుల, అంబిక, మందాకిని, కే . అనురాధ, అనిత, వర్ష భార్గవి, శారా మాథ్యుస్, శేరిన్ బి.ఎస్, చందనా చక్రవర్తి, మీరా సంఘమిత్ర, సుధా మురళి, వి. ఉషారాణి, దీపా ధనరాజ్, బి. శ్యామసుందరి, బి. పవిత్ర, రమా సరస్వతి, శాలిని మహదేవ్, అరుణ అత్తలూరి, అనురాధ బెల్లపు, గీతాంజలి, కొండేపూడి నిర్మల, రేణుకా అయోల, సమున్నత, సముజ్వల, డాక్టర్ సమత రోష్ని, ఎస్. దుర్గాభవాని, ఎస్.ఎస్.లక్ష్మి, వేమన వసంత లక్ష్మి , ప్రొఫెసర్ శాంతా సిన్హా, మణిమాల, తాయమ్మ కరుణ, ఇఫ్టు అనురాధ, సరళ, జయసుధ, నిర్మల, సుమబాల, ఎం.ఎం.వినోదిని, మంజుల, శైలజ, ఆర్ లక్ష్మి, శ్వేత, బి. జ్యోతి, ఎం.సుజాత, హేమలలిత, అనిసెట్టి రజిత, కొమర్రాజు రామలక్ష్మి, బండారు సుజాత, శివలక్ష్మి, లక్ష్మి సుహాసిని, పుట్ల హేమలత, పి. రాజ్యలక్ష్మి, కళ్యాణి కుమారి, ప్రేమ కుమారి, గీతాకుమారి, కే. జ్యోత్స్న, పద్మావతి, కే.సత్యలక్ష్మి, వోల్గా, రాధిక, టి. కళ్యాణి కుమారి, పద్మావతి, ఏ. ఎల్. శారద, సల్మా.”

(ఫేస్ బుక్ ఫోస్టు నుంచి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *